మే 2021 జాతీయం
Sakshi Education
కరోనా సవాళ్లపై ఆయుష్ శాఖ ప్రారంభించిన హెల్ప్‌లైన్?
కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను సూచించేందుకు కేంద్ర ఆయుష్ శాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 14443 టోల్ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి, సలహాలు, సూచనలు పొందవచ్చని మే 21న వెల్లడించింది. ఈ నంబర్ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా పని చేస్తుందని పేర్కొంది. ఆయుష్‌లోని ఆయుర్వేద, హోమియోపతి, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ తదితర విభాగాల నిపుణులు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సలహాలిస్తారని, అనారోగ్య సమస్యలకు చికిత్స మార్గాలను సూచిస్తారని తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 14443 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభం
ఎప్పుడు : మే 21
ఎవరు : కేంద్ర ఆయుష్ శాఖ
ఎందుకు: కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను సూచించేందుకు...
ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ పేరు?
దేశంలో కరోనాతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బ్లాక్ ఫంగస్ సంక్రమణపై ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి ఏమాత్రం కాదని, కరోనా మాదిరిగా ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించదని ఆయన పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ డయాబెటిస్ రోగికి మ్యూకోర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గులేరియా మే 24న తెలిపారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లను రంగుల పేర్లతో కాకుండా, మెడికల్ పరిభాషలోని పేర్లతోనే గుర్తించడం మంచిదని వ్యాఖ్యానించారు.
ఆన్సైట్ రిజిస్ట్రేషన్...
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇకపై 18–44 ఏళ్ల వయసు వారు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ముందస్తు నమోదులేకుండానే ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)లకు వచ్చి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మే 24న ప్రకటించింది. కోవిన్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగే ఈ ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం కేవలం ప్రభుత్వ సీవీసీల్లోనే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వ్యాక్సిన్ డోస్‌ల వృథాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అత్యంత తీవ్ర తుపాను యాస్ తీరం దాటిన ప్రాంతం?
అత్యంత తీవ్ర తుపాను ‘యాస్’ ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ మే 26న ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. అనంతరం బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది. పెను గాలులు, భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను కారణంగా ఒడిశాలో నలుగురు, బెంగాల్‌లో ఒకరు చనిపోయారు. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. పళ్ల తోటలు, పంటపొలాలు నాశనమయ్యాయి. దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత తీవ్ర తుపాను యాస్ తీరం దాటిన ప్రాంతం?
ఎప్పుడు : మే 26
ఎక్కడ : ధమ్ర పోర్ట్ సమీపం, ఒడిశా
కోవాగ్జిన్ ఫార్ములా బదిలీకి అంగీకారం
కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్ బయోటెక్ అంగీకరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో కోవిడ్ 19 టీకాల లభ్యతను గణనీయంగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకు వీలుగా న్యూ లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్ట్రాటెజీని రూపొందించినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సాంకేతిక బదిలీకి సంబంధించి ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫార్మా సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్), భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీఒఎల్), అలాగే, ముంబైకి చెందిన హాఫ్‌కిన్స్ బయోఫార్మా.. కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో టీకా సాంకేతికత బదిలీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. విదేశాల్లో రూపొందిన, విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ 19 టీకాలను భారత్‌లో వినియోగించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రారంభించామని తెలిపింది.
టౌటే తుపాన్‌కు పేరు పెట్టిన దేశం ఏది?
కరోనా విజృంభనకు తోడు తుపాను టౌటే తీర రాష్ట్రాలను వణికిస్తోంది. టౌటే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ మే 16న ప్రకటించింది. మే 18న గుజరాత్ లోని పోరుబందరుమహువ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్రమై తుపానుగా మారిన విషయం తెలిసిందే. టౌటే కారణంగా కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.
పేరు పెట్టిన దేశం మయన్మార్...
టౌటే అంటే బర్మీస్ భాషలో గెకో... గట్టిగా అరిచే బల్లి అని అర్థం. ప్రస్తుతం తుపాన్‌కు మయన్మార్ దేశం పెట్టిన పేరిది. మయన్మార్ ఎందుకు పెట్టింది అంటే... ఈసారి వాళ్ల వంతు కాబట్టి. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్/ యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ తుపాన్లకు పేర్లు పెడుతుంది. ఈ ప్యానెల్‌లోని 13 దేశాలు ఏషియా పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుపాన్లకు వంతులవారీగా పేర్లు పెడుతుంటాయి. దీంట్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలున్నాయి. ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి. ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల నుంచి తుపాన్లకు రొటేషన్ పద్ధతిలో ఆయా దేశాల వంతు వచ్చినపుడు.. వారు సూచించిన పేర్ల నుంచి ఒకటి వాడుతారు. కిందటి ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు నిసర్గగా బంగ్లాదేశ్ నామకరణం చేసింది. వాతావరణ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలు, సాధారణ ప్రజానీకం ప్రతి తుపాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ పేరు ఉపకరిస్తుంది.
వ్యాక్సిన్ల కోసం రూ.75 వేల కోట్ల వ్యయం
కోవిడ్19 మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా 2021 ఏడాది వ్యాక్సిన్ల కోసం భారతదేశం అక్షరాలా రూ.75 వేల కోట్లను వ్యయం చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు అన్నీ కలిపి 2021లో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం వ్యాక్సిన్లకు ఎంత వ్యయం అవుతుందనే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ ఇన్వెస్టెక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్‌వీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు రద్దు
కోవిడ్19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 2021లో నిర్వహించాల్సిన తమ వార్షిక సదస్సును రద్దు చేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది. తదుపరి సదస్సు 2022 ప్రథమార్ధంలో నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 ఏడాదిలో రూ.75 వేల కోట్ల వ్యయం
ఎప్పుడు : మే
ఎవరు : భారత్
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు: కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం...
అత్యంత తీవ్ర తుపాను టౌటే తీరం దాటిన ప్రాంతం?
గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న భీకర అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపాను టౌటే మే 17న గుజరాత్‌లోని పోరుబందర్ మహువా మధ్య తీరం దాటింది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ర్ట, కర్ణాటక, గోవా, కేరళలలో తుపాను ప్రభావం అధికంగా ఉందని వెల్లడించింది.
ప్లాస్మా థెరపీ నిలిపివేత
కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం మే 17న తొలగించింది. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే (వారి రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు) దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి తీవ్రత అంతగా లేనపుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు. ప్లాస్మా థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలకు సరైనా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తీరం దాటిన అత్యంత తీవ్ర తుపాను
ఎప్పుడు : మే 17
ఎవరు : టౌటే
ఎక్కడ : గుజరాత్‌లోని పోరుబందర్ మహువా మధ్య
కోవిడ్ టీకా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పోర్టల్ పేరు?
కోవిడ్ టీకా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ పోర్టల్ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని మే 17న కేంద్రం తెలిపింది. దీంతోపాటు దేశంలోని కోవిడ్ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవ్2 జినోమిక్ కన్సార్టియా) నెట్‌వర్క్‌లో మరో 17 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వీటిద్వారా మరిన్ని శాంపిళ్లను పరీక్షించేందుకు, మరింత విశ్లేషణ చేపట్టేందుకు వీలవుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇలాంటి 10 ల్యాబ్‌లున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కోవిన్ పేరుతో అందుబాటులోకి పోర్టల్
ఎప్పుడు : మే 17
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు: ప్రజలకు కోవిడ్ టీకా అందించేందుకు..
కేంద్రం ఏ పథకంలో భాగంగా అదనపు ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోంది?
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకే)లో భాగంగా జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు అదనపు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ ప్రకటించింది. పీఎంజీకే ద్వారా 16 రాష్ట్రాలకు 2021, మే నెల ఆహార ధాన్యాలు వందశాతం సరఫరా చేసినట్లు పేర్కొంది. 2021 మే 17వ తేదీ నాటికి అన్ని 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల నుంచి 31.80 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు సరఫరా చేసినట్లు తెలిపింది.
కరోనా ఆంక్షల నేపథ్యంలో...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల నేపథ్యంలో అదనపు ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రకారం... సుమారు 80 కోట్లమంది లబ్ధిదారులకు ప్రస్తుతం అందిస్తున్న ఆహార ధాన్యాలతో పాటు అదనంగా నెలకు 5 కిలోలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ నిర్ణయం 2021, మే, జూన్ నెలల్లో అమలులో ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు 5 కిలోల అదనపు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ
ఎప్పుడు : మే 18
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు: దేశంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల నేపథ్యంలో...

Published date : 29 Jun 2021 02:59PM