మే 2017 జాతీయం
Sakshi Education
ఆన్‌లైన్‌లో అకడమిక్ వివరాల కోసం ఈసనద్
సర్టిఫికెట్ల ధ్రువీకరణ సహా విద్యార్థుల అకడమిక్ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండేలా కేంద్రం ప్రభుత్వం ఈసనద్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల వెరిఫికేషన్ కోసం కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ‘ఈసనద్’ అనే పోర్టల్‌ను మే 24న ప్రారంభించింది. దీనిలో సీబీఎస్‌ఈకి చెందిన ‘పరిణామ్ మంజూష’ సహా విద్యార్థుల అకడమిక్ వివరాలు, సర్టిఫికెట్లన్నీ అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆన్‌లైన్‌లో అకడమిక్ వివరాల కోసం ఈసనద్
ఎప్పుడు : మే 24
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్ల సర్వీసులు
ప్రభుత్వ రంగ దిగ్గజ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ శాటిలైట్ ఫోన్ సర్వీస్‌ను మే 24న ప్రారంభించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మొబైల్ శాటిలైట్ ఆర్గనైజేషన్ (ఐఎన్‌ఎంఏఆర్‌ఎస్‌ఏటీ) ద్వారా ఈ సేవలను తొలిగా గవర్నమెంట్ ఏజెన్సీలకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది.
స్టేట్ పోలీస్, రైల్వేస్, సరిహద్దు భద్రతా దళం, ఇతర ప్రభుత్వ సంస్థలకు తొలిగా ఫోన్లను అందివ్వనున్నారు. ప్రస్తుతం శాటిలైట్ ఫోన్ల సర్వీసులు అందిస్తోన్న టాటా కమ్యూనికేషన్‌స గడువు జూన్ 30 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత అన్ని కనెక్షన్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు బదిలీ అవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శాటిలైట్ల ఫోన్ సర్వీసులు
ఎప్పుడు : మే 24
ఎవరు : బీఎస్‌ఎన్‌ఎల్
ఐదుగురు మావోయిస్టులకు మరణశిక్ష
2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లను కాల్చిచంపిన కేసులో ఐదుగురు మావోయిస్టులను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి ముంగర్ కోర్టు మే 25న మరణశిక్ష విధించింది. దోషులు విపిన్ మండల్, అధికలాల్ పండిట్, రాతు కోడా, వానో కోడా, మను కోడాలకు అడిషనల్ సెషన్‌స జడ్జి జ్యోతి స్వరూప్ శ్రీవాత్సవ రూ.25 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. 2014 ఏప్రిల్‌లో గంగ్టా-లక్ష్మీపూర్ మార్గంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై 50 మంది నక్సలైట్లు మెరుపు దాడి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదుగురు మావోయిస్టులకు మరణశిక్ష
ఎప్పుడు : మే 25
ఎవరు : ముంగర్ కోర్టు, బిహార్
ఎందుకు : 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లను కాల్చిచంపిన కేసులో
టాప్-10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్
ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్ ఐదో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ‘ట్రిప్ అడ్వైజర్’ సంస్థ ‘ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్‌మార్క్స్’ పేరిట ఈ జాబితాను మే 25న విడుదల చేసింది.
కాంబోడియాలోని అంగ్ కోర్‌వాట్ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకోగా రెండు, మూడు స్థానాల్లో అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, స్పెయిన్‌లోని మెజ్‌క్విటా క్యాథడ్రెల్ డీ కోర్డొబా నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ అద్భుత కట్టడాల్లో 5వ స్థానంలో తాజ్‌మహల్
ఎప్పుడు : మే 25
ఎవరు : ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్‌మార్క్స్, ట్రిప్ అడ్వయిజర్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
కేరళలో వృద్ధులకు ‘అక్షర సాగరం’
అక్షరాస్యతలో ముందుండే కేరళ అక్షరసాగరం పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. తీరప్రాంతాలలోని వృద్ధులకు చదువు చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. తీరప్రాంతంలో నివసిస్తున్న పెద్ద వయసు వారిని గుర్తించి, చదువు చెప్పి పంచాయతీ స్థాయిలో ప్రభుత్వం అక్షరాస్యతను పెంచనుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న వారిలో 86 ఏళ్ల వయస్సుపైబడిన వృద్ధులు కూడా ఉన్నారు.
మొదటి దశలో 81 తీరప్రాంత వార్డులు, 15 పంచాయతిలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మలప్పురం, తిరువనంతపురం, కసరగాడ్ జిల్లాలను దీనికోసం ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వృద్ధులకు అక్షరసాగరం
ఎప్పుడు : మే 2017
ఎవరు : కేరళ ప్రభుత్వం
ఎక్కడ : కేరళలో
ఎందుకు : తీర ప్రాంత వృద్ధుల్లో అక్షరాస్యత పెంచేందుకు
పశువుల క్రయవిక్రయాలపై ఆంక్షలు
సంతల్లో పశువుల (ఆవు, గేదె, ఎద్దు, ఒంటెలు) క్రయ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పశువుల క్రూరత్వ నిరోధక చట్టం-2017 (పశువుల సంతల నియంత్రణ)లో పలు మార్పులు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మే 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త నిబంధనలు
ఏమిటి : సంతలో పశువుల విక్రయాలపై ఆంక్షలు
ఎప్పుడు : మే 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా
ధోలా-సదియా వంతెనను ప్రారంభించిన మోదీ
అసోంలోని సదియా ప్రాంతంలో లోహిత్ నది (బ్రహ్మపుత్ర ఉపనది)పై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెన (9.15 కిలోమీటర్లు)ను ప్రధాని నరేంద్ర మోదీ మే 26న జాతికి అంకితం చేశారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఈ వంతెనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత-గాయకుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. మహారాష్ట్రలోని ముంబయిలో బాంద్రా - వోర్లీ మధ్య ఉన్న 3.5 కిలోమీటర్ల వంతెన ఇంతకముందు భారత్‌లోని అతిపొడవైన వంతెనగా ఉండేది.
ధోలా-సదియా వంతెన విశేషాలు
ఏమిటి : దేశంలోనే నదిపై పొడవైన వంతెన ప్రారంభం
ఎప్పుడు : మే 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సదియా, అసోం
ఎన్డీఏ ప్రభుత్వ మూడేళ్ల సంబరాలు
2017 మే 26తో ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న దేశవ్యాప్త సంబరాలను అసోంలోని గువాహటిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నవభారత నిర్మాణంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాల వ్యాపార కేంద్రంగా మార్చనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా భారత్‌ను సూపర్ పవర్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అనంతరం అస్సాంలోని కామరూప్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
‘సంపద’ను ప్రారంభించిన మోదీ
అస్సాంలోని ధేమాజీ జిల్లాలో భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.6 వేల కోట్లతో ‘సంపద’ (స్కీమ్ ఫర్ ఆగ్రో-మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆగ్రో-ప్రాసెసింగ్) పథకాన్ని ప్రారంభించారు.
గుజరాత్‌లో ఆవులకు ‘ఆధార్’
గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ఆధార్’ పద్ధతికి శ్రీకారం చుట్టిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. ఆవుల చెవుల్లో ఐడీ నంబర్‌తో ఉండే డిజిటల్ చిప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రమంతా టెక్నిషీయన్ల బృందాలను పంపించింది. తొలిదశలో భాగంగా.. 37వేల ఆవులకు యునిక్ ఐడెంటీ నంబర్లను కేటాయించనుంది. ఆవుల ఆక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ డిజిటల్ చిప్‌లు ఉపయోగపడతాయని ప్రభుత్వం వివరించింది.
ఈ చిప్‌ల్లో ఆవులకు కేటాయించిన నంబర్, వాటి అడ్రసు, రంగు, ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు.
గోవధకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే చట్టాన్ని గుజరాత్ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్‌లో ఆవులకూ ‘ఆధార్’
ఎప్పుడు : మే 26
ఎవరు : గుజరాత్ ప్రభుత్వం
ఎందుకు : గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు
అడ్వాణీ, జోషి, ఉమా భారతిపై కుట్ర అభియోగాలు
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రూ. 50 వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం.
ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అడ్వాణీ , జోషి, ఉమా భారతి సహా 12 మందిపై కుట్ర అభియోగాలు
ఎప్పుడు : మే 30
ఎవరు : సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
ఎక్కడ : లక్నో
ఎందుకు : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో
జయలలిత, శశికళ ఆస్తుల జప్తు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన ఆస్తుల జప్తుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మే 30న ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకూడి, తంజావూరు జిల్లాల్లోని వీరి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక అవినీతి నిరోధక, నిఘా విభాగ డెరైక్టర్ మంజునాథ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 6 జిల్లాల్లోని 68 ఆస్తుల జప్తుకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆస్తులకు తమిళనాడు ప్రభుత్వమే పూర్తి హక్కుదారుగా ఉంటుంది. అవసరమైతే శాఖాపరమైన అవసరాలకు వాడుకోవచ్చు లేదా బహిరంగ వేలం వేయొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జయలలిత, శశికళ ఆస్తుల జప్తు
ఎప్పుడు : మే 30
ఎవరు : త మిళనాడు ప్రభుత్వం
పశువధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు స్టే
పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు మే 30న నాలుగు వారాల స్టే విధించింది. ఈ మేరకు నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మదురై బెంచ్‌కి చెందిన జస్టిస్ ఎంవీ మురళీధరన్, జస్టిస్ సీవీ కార్తికేయన్‌ల ధర్మాసనం ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పశువధ నిషేధంపై స్టే
ఎప్పుడు : మే 30
ఎవరు : మద్రాస్ హైకోర్టు
‘దంగల్’కు చైనాలో వెయ్యి కోట్లు
భారత్‌లో వసూళ్ల రికార్డు సృష్టించిన అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’.. చైనాలో వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తం చైనా సినీ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన సినిమాల్లో 33వదిగా మరో రికార్డునూ సొంతం చేసుకుంది. చైనా కరెన్సీలో ఒక బిలియన్ ఆర్‌ఎంబీలను దంగల్ వసూలు చేసిందని ‘మయన్’ వెబ్‌సైట్ తెలిపింది. చైనాలో ‘మయన్’ ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్.
కాగా చైనాలో దంగల్‌ను మే 5న విడుదల చేశారు. అప్పటి నుంచి 15 రోజుల పాటు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద తొలి స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. వెయ్యి కోట్ల దాటిన దంగల్ సినిమా వసూళ్లు
ఎప్పుడు : మే 30
ఎక్కడ : చైనాలో
భారత్‌లో ఆన్‌లైన్ విద్యకు భారీ మార్కెట్
2021 నాటికి భారత్‌లో ఆన్‌లైన్ విద్యారంగం మార్కెట్ 1.96 బిలియన్ డాలర్ల (రూ.12,544 కోట్లు సుమారు)కు చేరుకుంటుందని గూగుల్-కేపీఎంజీ నివేదిక పేర్కొంది. పెయిడ్ యూజర్లు (డబ్బులు చెల్లించి సేవలు పొందేవారు) 2016లో 16 లక్షల మంది ఉండగా... 2021 నాటికి వీరి సంఖ్య ఆరు రెట్ల వృద్ధితో 96 లక్షలకు చేరుతుందని ‘భారత్‌లో ఆన్‌లైన్ విద్య: 2021’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఇతర వివరాలు..
ఏమిటి : భారత్‌లో ఆన్‌లైన్ విద్య - 2021
ఎప్పుడు : మే 30
ఎవరు : గూగుల్-కేపీఎంజీ
ప్రసూతి ప్రయోజన పథకానికి కేబినెట్ ఆమోదం
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్నందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మే 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గర్భవతిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు రూ.1000, ఆర్నెల్ల తర్వాత రూ.2000, ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన తర్వాత మరో రెండు వేల రూపాయలను (మొదటి విడత బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్-బి టీకాలు వేయించుకున్నారన్న ధ్రువీకరణ తర్వాతే) అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రసూతి ప్రయోజన పథకానికి ఆమోదం
ఎప్పుడు : మే 17
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పాలిచ్చే తల్లులకు రూ. 6వేలు ఆర్థిక సహాయం
10 అణువిద్యుత్ ప్లాంట్లకు కేబినెట్ ఆమోదం
దేశీయ అణు విద్యుదుత్పత్తికి తోడ్పాటునందించేందుకు 10 అణురియాక్టర్ల నిర్మాణానికి కేబినెట్ మే 17న ఆమోదం తెలిపింది. కేంద్రం ఒకేసారి ఇన్ని రియాక్టర్లకు అనుమతివ్వటం ఇదే మొదటిసారి. ఒక్కో ప్లాంట్ సామర్థ్యం 700 మెగావాట్లు. వీటి నిర్మాణం పూర్తయితే 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న 22 ప్లాంట్ల ద్వారా 6780 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాజస్తాన్, గుజరాత్, తమిళనాడుల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల ద్వారా 2021-22 కల్లా మరో 6700 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : మే 17
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో
ఎందుకు : అణు విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు
కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్షపై ఐసీజే స్టే
కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) స్టే విధించింది. ఈ మేరకు మే 15న భారత్, పాకిస్తాన్‌ల వాదనలు విన్న ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్ష అమలుపై స్టే విధిస్తూ మే 18న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను అమలు చేయరాదంటూ పాక్‌ను ఆదేశించింది.
ఈ కేసులో పాక్ వైఖరిని తప్పుపట్టిన న్యాయస్థానం.. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి (1977లో భారత్-పాకిస్థాన్‌లు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి) వ్యతిరేకమని స్పష్టం చేసింది. జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది.
జాధవ్ కేసు పూర్వపరాలు
2016 మార్చి 23న బలూచిస్తాన్‌లో భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ (46)ను అరెస్టు చేసిన పాకిస్తాన్ బలగాలు అతడిపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశాయి. దీనిపై స్పందించిన భారత్ జాధవ్ గతంలో నేవీలో పనిచేశారని.. అయితే ఆయన అరెస్టుకు ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతడికి సంబంధం లేదని ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో జాధవ్‌పై విచారణ ప్రారంభించిన పాక్ మిలటరీ కోర్టు భారత్ చెప్పిన అంశాలను పరిగణలోకీ తీసుకోలేదు. అత్యంత వివాదాస్పదంగా కేవలం నాలుగు విచారణల్లోనే జాధవ్‌ను దోషిగా తేల్చిన మిలటరీ కోర్టు.. 2017 ఫిబ్రవరి 10న మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు 2017 ఏప్రిల్ 10న అధికారికంగా ప్రకటించారు.
దీనిపై భారత ప్రభుత్వం నెదర్లాండ్‌సలోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం మే 15 - 18 వరకూ విచారణ జరిపింది. భారత్‌తోపాటు పాకిస్థాన్ వాదనలు వినిపించాయి ( కేవలం ఒక్క రూపాయి ఫీజుతో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు ). పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జాధవ్‌కు ఎలాంటి దౌత్యసాయం అందకుండా అడ్డుకుంటోందని భారత్ వివరించింది. దీనిపై తాము 16 సార్లు విన్నవించినా కూడా తిరస్కరించిందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనను పాకిస్థాన్ తప్పుబట్టింది. జాధవ్ ఒక గూఢచారి అని.. వియన్నా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు, గూఢచర్యం చేసేవారికి దౌత్యసాయం ఉండదని వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. తమ తుది తీర్పు వచ్చేవరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది.
పాక్ వాదన వీగిందిలా...
‘‘జాధవ్ మరణశిక్షపై అప్పీలును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదు’’...‘‘గూఢచర్యం కింద అరెస్టైన వ్యక్తికి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించే హక్కు ఉండదు’’...అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ వాదనల్లోని రెండు ప్రధానాంశాలివి. ఈ రెండింటినీ ఐసీజే తోసిపుచ్చింది. వివిధ దేశాల్లో దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి హక్కులు, దౌత్యపరమైన రక్షణలు ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిన ఉండాలనే ఉద్దేశంతో వియన్నాలో 1963లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 1967 మార్చి 19 నుంచి వియన్నా ఒప్పందం (Vienna Convention on Consular Relations, 1963 )అమలులోకి వచ్చింది. దీనిపై భారత్ పాకిస్తాన్ 1969 ఏప్రిల్ 14, 1977 నవంబర్ 28న సంతకాలు చేశాయి.
ఐసీజే పరిధిపై...
‘వియన్నా ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ఏదైనా వివాదం వస్తే, అది తప్పనిసరిగా ఐసీజే పరిధిలోకే వస్తుంది. ఇరుపార్టీల్లో ఎవరైనా ఐసీజేను ఆశ్రయించవచ్చు’ అనేది ఒప్పందంలోని ఓ నిబంధన. దీని మూలంగానే పాక్ మొదటి వాదన వీగిపోయింది.
వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ఏంటంటే..
స్వదేశస్తులకు సంబంధించి దౌత్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడానికి వీలుగా...
ఏమిటి : తలాక్‌కు సంఘ బహిష్కరణ విధించాలన్న ఐఏఎంపీఎల్‌బీ
ఎప్పుడు : మే 22
ఎవరు : సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పణ
దేశంలో తొలి లగ్జరీ రైలు తేజస్ ప్రారంభం
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తేజస్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలెక్కింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్, గోవాలోని కర్మాలి స్టేషన్ల మధ్య నడిచే తొలి తేజస్ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మే 22న ముంబైలో జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 200 కి.మీ. వేగంతో వెళ్లగల ఈ రైలు ప్రస్తుతానికి 130 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ 630 కి.మీ దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుంటుంది. వర్షాకాలం తప్ప మిగిలిన రోజుల్లో ముంబై-గోవాల మధ్య వారానికి ఐదు రోజులు, వర్షాకాలంలో వారానికి మూడు రోజులు ఈ రైలు నడవనుంది. మొత్తం 20 బోగీలు ఉంటాయి. రైలు బోగీలను పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. భారతీయ రైల్వేలో ఇప్పటికి ఇదే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు.
తేజస్ రైలు ప్రత్యేకతలు
ఏమిటి : లగ్జరీ రైలు తేజస్ ప్రారంభం
ఎప్పుడు : మే 22
ఎవరు : కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : ముంబై - గోవా మధ్య
యూపీలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా హెల్మెట్ లేనివారికి పెట్రోల్ విక్రయించొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని లక్నోలో మే 22 నుంచి నో హెల్మెట్ - నో ఫ్యూయల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి ఇంధనం విక్రయించకూడదని లక్నోలోని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించిన ప్రభుత్వం.. అలా వచ్చే వారి బైక్ నంబర్లను నోట్ చేసి పోలీసులకు ఇవ్వాలని సూచించింది. ఇది విజయవంతమైతే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తారు.
2016లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నో హెల్మెట్ - నో ఫ్యూయల్ విధానం
ఎప్పుడు : మే 22
ఎవరు : యూపీ ప్రభుత్వం
ఎక్కడ : లక్నోలో
ఎందుకు : రహదారి ప్రమాదాల నివారణకు
పరిశోధనకు ‘వజ్ర’ కార్యక్రమం
భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ శాస్త్రవేత్తలు మూడు నెలలు పనిచేసేలా కేంద్రం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది. ‘విజిటింగ్ అడ్వాన్‌సడ్ జాయింట్ రీసెర్చ్’(వజ్ర)గా పిలిచే ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తారు. విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో పనిచేసేలా ప్రోత్సహించడంతో పాటు, మన పరిశోధక విద్యార్థులకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ‘మన విద్యార్థులకు విదేశీ పరిశోధన సంస్కృతిని పరిచయం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. శాస్త్రవేత్తలు తొలి నెల్లో 9.72 లక్షలు, తర్వాత నెలకు 6.48 లక్షలు వేతనంగా పొందుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశీయ శాస్త్ర సంస్థల్లో పరిశోధనకు వజ్ర కార్యక్రమం
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ శాస్త్రవేత్తలు మూడు నెలలు పనిచేసేందుకు
దేశీయ వలసల్లో 3వ స్థానం
అంతర్గత వలసలు అధికంగా నమోదవుతున్న మూడో దేశంగా భారత్ నిలిచింది. 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోని(భారత్‌లో) వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారని అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం(ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి(ఎన్‌ఆర్‌సీ).. మే 22న విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. దీని ప్రకారం అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలస వెళ్లగా, 59 లక్షల మందితో ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానంలో ఉంది.
సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రారంభం
సుప్రీం కోర్టులో సమగ్ర కేసు సమాచార నిర్వహణ వ్యవస్థ (integrated case management system) అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మే 10న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా డిజిటల్ ఫైలింగ్ చేసిన కేసు వివరాలను దేశంలో ఉన్న 24 హైకోర్టులతో పాటు సబార్డినేట్ కోర్టులతో అనుసంధానం చేస్తారు.
ఈ వ్యవస్థ ద్వారా కక్షిదారులు కేసుకు సంబంధించిన వివరాలను పొందటంతోపాటు ఆన్‌లైన్‌లోనే కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టులో సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు : మే 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : కేసుల వివరాల డిజిటిల్ ఫైలింగ్ కోసం
ట్రిపుల్ తలాక్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మే 11న విచారణ ప్రారంభించింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించమని తెలిపింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే దానిపై చర్చ జరుగుతుందని.. ఇది ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్ధారణ అయితే దీని రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) సభ్యులుగా (ఒక్కో మతం నుంచి ఒక్కరు) ఉన్నారు.
ట్రిపుల్ తలాక్ ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకం అని సైరా బానో అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్‌పై విచారణ ప్రారంభం
ఎప్పుడు : మే 11
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్ధతను నిర్ధారించడానికి
విద్యుదీకరణపై ప్రధాని సమీక్ష
విద్యుదీకరణ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 9న సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 18,452 గ్రామాలకుగాను 13 వేల గ్రామాలకు విద్యుదీకరణ పూర్తైదని, లక్ష్యం ప్రకారం 1000 రోజుల్లో అన్ని గ్రామాలకు విద్యుదీకరణను పూర్తి చేస్తామని ప్రధానమంత్రికి అధికారులు వివరించారు.
చార్‌ధామ్‌కు రైలు మార్గంపై సర్వే పూర్తి
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ (యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్- బద్రీనాథ్) పుణ్య క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే రైల్వే మార్గం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రైల్వే వికాస్ నిగమ్ దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేసింది. మొత్తం 327 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ.43292 కోట్ల వ్యయంతో (అంచనా) నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చార్‌దామ్‌కు రైలు మార్గం
ఎప్పుడు : ప్రతిపాదించి సర్వే పూర్తిచేశారు
ఎవరు : రైల్వే మంత్రిత్వ శాఖ
ఫిట్ ఇండియా సర్వే - 2017
దేశంలో 20 - 25 ఏళ్ల మధ్య వయసున్న యువతలో 6.5 మంది వ్యాయామాలపై అవగాహన కలిగి ఉన్నారని రీబాక్ సంస్థ వెల్లడించింది. వ్యాయామం విషయంలో భారతీయుల ఆలోచనలు, అలవాట్లను గుర్తించేందుకు ‘ఫిట్ ఇండియా’ పేరిట ఒక సర్వే నిర్వహించిన సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది మహా నగరాల్లో 20-25 మధ్య వయసున్న 1,500 మందిని సర్వే చేయడం ద్వారా రీబాక్ ఈ ఫలితాలను రాబట్టింది.
సర్వే వివరాలు

- కొత్త నిబంధనల ప్రకారం ఇకపై సంతలో పశువులను కొని కబేళాలకు తరలించడం కుదరదు. కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే సంతల్లో పశువుల క్రయవిక్రయాలు సాగాలి. ఈ నిబంధనలు వట్టిపోయిన పశువులకూ వర్తిస్తాయి.
- పశువుల విక్రయం సమయంలో తాను వ్యవసాయ దారుడినని రుజువు చేసుకునేలా అమ్మేవ్యక్తి, వాటిని కబేళాలకు తరలించేందుకు కాదంటూ కొనుగోలుదారులు హామీ పత్రం సమర్పించాలి. దీనిని పశువుల సంత నిర్వహణ కమిటీలు ధ్రువీకరించాలి.
- పశువుల సంత నిర్వహణ కమిటీ పశు విక్రయాలకు సంబంధించి దాదాపు ఆరు నెలల రికార్డులు అందుబాటులో ఉంచాలి.
- అనుమతి లేకుండా పశువుల కొనుగోలుదారులు వేరే రాష్ట్రంలో వాటిని విక్రయించకూడదు.
ఏమిటి : సంతలో పశువుల విక్రయాలపై ఆంక్షలు
ఎప్పుడు : మే 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా
ధోలా-సదియా వంతెనను ప్రారంభించిన మోదీ
అసోంలోని సదియా ప్రాంతంలో లోహిత్ నది (బ్రహ్మపుత్ర ఉపనది)పై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెన (9.15 కిలోమీటర్లు)ను ప్రధాని నరేంద్ర మోదీ మే 26న జాతికి అంకితం చేశారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఈ వంతెనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత-గాయకుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. మహారాష్ట్రలోని ముంబయిలో బాంద్రా - వోర్లీ మధ్య ఉన్న 3.5 కిలోమీటర్ల వంతెన ఇంతకముందు భారత్‌లోని అతిపొడవైన వంతెనగా ఉండేది.
ధోలా-సదియా వంతెన విశేషాలు
- ఈ వంతెనతో అసోం - అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం 165 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 5 గంటలు తగ్గుతుంది.
- 2011లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు వ్యయం రూ.950 కోట్లు. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ దీన్ని నిర్మించింది.
- యుద్ధ ట్యాంకులు వెళ్లినా తట్టుకునే సామర్థ్యంతో వంతెనను నిర్మించారు. దీని ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లోకి సైనిక బలగాలు సులువుగా చేరేందుకు వీలు కలుగుతుంది.
- ఈ వంతెన భారత్ - చైనా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.
ఏమిటి : దేశంలోనే నదిపై పొడవైన వంతెన ప్రారంభం
ఎప్పుడు : మే 26
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సదియా, అసోం
ఎన్డీఏ ప్రభుత్వ మూడేళ్ల సంబరాలు
2017 మే 26తో ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న దేశవ్యాప్త సంబరాలను అసోంలోని గువాహటిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నవభారత నిర్మాణంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాల వ్యాపార కేంద్రంగా మార్చనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా భారత్‌ను సూపర్ పవర్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అనంతరం అస్సాంలోని కామరూప్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
‘సంపద’ను ప్రారంభించిన మోదీ
అస్సాంలోని ధేమాజీ జిల్లాలో భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.6 వేల కోట్లతో ‘సంపద’ (స్కీమ్ ఫర్ ఆగ్రో-మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆగ్రో-ప్రాసెసింగ్) పథకాన్ని ప్రారంభించారు.
గుజరాత్‌లో ఆవులకు ‘ఆధార్’
గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ఆధార్’ పద్ధతికి శ్రీకారం చుట్టిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. ఆవుల చెవుల్లో ఐడీ నంబర్‌తో ఉండే డిజిటల్ చిప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రమంతా టెక్నిషీయన్ల బృందాలను పంపించింది. తొలిదశలో భాగంగా.. 37వేల ఆవులకు యునిక్ ఐడెంటీ నంబర్లను కేటాయించనుంది. ఆవుల ఆక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ డిజిటల్ చిప్‌లు ఉపయోగపడతాయని ప్రభుత్వం వివరించింది.
ఈ చిప్‌ల్లో ఆవులకు కేటాయించిన నంబర్, వాటి అడ్రసు, రంగు, ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు.
గోవధకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే చట్టాన్ని గుజరాత్ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్‌లో ఆవులకూ ‘ఆధార్’
ఎప్పుడు : మే 26
ఎవరు : గుజరాత్ ప్రభుత్వం
ఎందుకు : గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు
అడ్వాణీ, జోషి, ఉమా భారతిపై కుట్ర అభియోగాలు
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రూ. 50 వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం.
ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అడ్వాణీ , జోషి, ఉమా భారతి సహా 12 మందిపై కుట్ర అభియోగాలు
ఎప్పుడు : మే 30
ఎవరు : సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం
ఎక్కడ : లక్నో
ఎందుకు : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో
జయలలిత, శశికళ ఆస్తుల జప్తు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన ఆస్తుల జప్తుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మే 30న ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకూడి, తంజావూరు జిల్లాల్లోని వీరి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక అవినీతి నిరోధక, నిఘా విభాగ డెరైక్టర్ మంజునాథ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 6 జిల్లాల్లోని 68 ఆస్తుల జప్తుకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆస్తులకు తమిళనాడు ప్రభుత్వమే పూర్తి హక్కుదారుగా ఉంటుంది. అవసరమైతే శాఖాపరమైన అవసరాలకు వాడుకోవచ్చు లేదా బహిరంగ వేలం వేయొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జయలలిత, శశికళ ఆస్తుల జప్తు
ఎప్పుడు : మే 30
ఎవరు : త మిళనాడు ప్రభుత్వం
పశువధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు స్టే
పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు మే 30న నాలుగు వారాల స్టే విధించింది. ఈ మేరకు నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మదురై బెంచ్‌కి చెందిన జస్టిస్ ఎంవీ మురళీధరన్, జస్టిస్ సీవీ కార్తికేయన్‌ల ధర్మాసనం ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పశువధ నిషేధంపై స్టే
ఎప్పుడు : మే 30
ఎవరు : మద్రాస్ హైకోర్టు
‘దంగల్’కు చైనాలో వెయ్యి కోట్లు
భారత్‌లో వసూళ్ల రికార్డు సృష్టించిన అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’.. చైనాలో వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తం చైనా సినీ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన సినిమాల్లో 33వదిగా మరో రికార్డునూ సొంతం చేసుకుంది. చైనా కరెన్సీలో ఒక బిలియన్ ఆర్‌ఎంబీలను దంగల్ వసూలు చేసిందని ‘మయన్’ వెబ్‌సైట్ తెలిపింది. చైనాలో ‘మయన్’ ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్.
కాగా చైనాలో దంగల్‌ను మే 5న విడుదల చేశారు. అప్పటి నుంచి 15 రోజుల పాటు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద తొలి స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. వెయ్యి కోట్ల దాటిన దంగల్ సినిమా వసూళ్లు
ఎప్పుడు : మే 30
ఎక్కడ : చైనాలో
భారత్‌లో ఆన్‌లైన్ విద్యకు భారీ మార్కెట్
2021 నాటికి భారత్‌లో ఆన్‌లైన్ విద్యారంగం మార్కెట్ 1.96 బిలియన్ డాలర్ల (రూ.12,544 కోట్లు సుమారు)కు చేరుకుంటుందని గూగుల్-కేపీఎంజీ నివేదిక పేర్కొంది. పెయిడ్ యూజర్లు (డబ్బులు చెల్లించి సేవలు పొందేవారు) 2016లో 16 లక్షల మంది ఉండగా... 2021 నాటికి వీరి సంఖ్య ఆరు రెట్ల వృద్ధితో 96 లక్షలకు చేరుతుందని ‘భారత్‌లో ఆన్‌లైన్ విద్య: 2021’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఇతర వివరాలు..
- ఆన్‌లైన్‌లో విద్యా సంబంధిత సమాచారం కోసం అన్వేషించే వారి సంఖ్య గత రెండేళ్లలో రెండు రెట్లు, మొబైల్స్ ద్వారా వెతికే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. మొత్తం మీద ఈ విధంగా శోధించే వారిలో 44 శాతం మంది ఆరు మెట్రో నగరాలకు వెలుపలి నుంచే ఉన్నారు.
- 2016లో ఒక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారానే విద్యా సంబంధిత కంటెంట్ వినియోగంలో నాలుగు రెట్ల పెరుగుదల కనిపించింది.
- ఆన్‌లైన్‌లో పరీక్షలకు సన్నద్ధమయ్యే విభాగం ఏటా 64 శాతం పెరుగుతూ 2021కి 51.5 కోట్లకు విస్తరించనుంది.
ఏమిటి : భారత్‌లో ఆన్‌లైన్ విద్య - 2021
ఎప్పుడు : మే 30
ఎవరు : గూగుల్-కేపీఎంజీ
ప్రసూతి ప్రయోజన పథకానికి కేబినెట్ ఆమోదం
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్నందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మే 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గర్భవతిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు రూ.1000, ఆర్నెల్ల తర్వాత రూ.2000, ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన తర్వాత మరో రెండు వేల రూపాయలను (మొదటి విడత బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్-బి టీకాలు వేయించుకున్నారన్న ధ్రువీకరణ తర్వాతే) అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రసూతి ప్రయోజన పథకానికి ఆమోదం
ఎప్పుడు : మే 17
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పాలిచ్చే తల్లులకు రూ. 6వేలు ఆర్థిక సహాయం
10 అణువిద్యుత్ ప్లాంట్లకు కేబినెట్ ఆమోదం
దేశీయ అణు విద్యుదుత్పత్తికి తోడ్పాటునందించేందుకు 10 అణురియాక్టర్ల నిర్మాణానికి కేబినెట్ మే 17న ఆమోదం తెలిపింది. కేంద్రం ఒకేసారి ఇన్ని రియాక్టర్లకు అనుమతివ్వటం ఇదే మొదటిసారి. ఒక్కో ప్లాంట్ సామర్థ్యం 700 మెగావాట్లు. వీటి నిర్మాణం పూర్తయితే 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న 22 ప్లాంట్ల ద్వారా 6780 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాజస్తాన్, గుజరాత్, తమిళనాడుల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల ద్వారా 2021-22 కల్లా మరో 6700 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం
ఎప్పుడు : మే 17
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో
ఎందుకు : అణు విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు
కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్షపై ఐసీజే స్టే
కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) స్టే విధించింది. ఈ మేరకు మే 15న భారత్, పాకిస్తాన్‌ల వాదనలు విన్న ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్ష అమలుపై స్టే విధిస్తూ మే 18న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను అమలు చేయరాదంటూ పాక్‌ను ఆదేశించింది.
ఈ కేసులో పాక్ వైఖరిని తప్పుపట్టిన న్యాయస్థానం.. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి (1977లో భారత్-పాకిస్థాన్‌లు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి) వ్యతిరేకమని స్పష్టం చేసింది. జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది.
జాధవ్ కేసు పూర్వపరాలు
2016 మార్చి 23న బలూచిస్తాన్‌లో భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ (46)ను అరెస్టు చేసిన పాకిస్తాన్ బలగాలు అతడిపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశాయి. దీనిపై స్పందించిన భారత్ జాధవ్ గతంలో నేవీలో పనిచేశారని.. అయితే ఆయన అరెస్టుకు ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతడికి సంబంధం లేదని ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో జాధవ్‌పై విచారణ ప్రారంభించిన పాక్ మిలటరీ కోర్టు భారత్ చెప్పిన అంశాలను పరిగణలోకీ తీసుకోలేదు. అత్యంత వివాదాస్పదంగా కేవలం నాలుగు విచారణల్లోనే జాధవ్‌ను దోషిగా తేల్చిన మిలటరీ కోర్టు.. 2017 ఫిబ్రవరి 10న మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు 2017 ఏప్రిల్ 10న అధికారికంగా ప్రకటించారు.
దీనిపై భారత ప్రభుత్వం నెదర్లాండ్‌సలోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం మే 15 - 18 వరకూ విచారణ జరిపింది. భారత్‌తోపాటు పాకిస్థాన్ వాదనలు వినిపించాయి ( కేవలం ఒక్క రూపాయి ఫీజుతో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు ). పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జాధవ్‌కు ఎలాంటి దౌత్యసాయం అందకుండా అడ్డుకుంటోందని భారత్ వివరించింది. దీనిపై తాము 16 సార్లు విన్నవించినా కూడా తిరస్కరించిందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనను పాకిస్థాన్ తప్పుబట్టింది. జాధవ్ ఒక గూఢచారి అని.. వియన్నా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు, గూఢచర్యం చేసేవారికి దౌత్యసాయం ఉండదని వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. తమ తుది తీర్పు వచ్చేవరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది.
పాక్ వాదన వీగిందిలా...
‘‘జాధవ్ మరణశిక్షపై అప్పీలును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదు’’...‘‘గూఢచర్యం కింద అరెస్టైన వ్యక్తికి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించే హక్కు ఉండదు’’...అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ వాదనల్లోని రెండు ప్రధానాంశాలివి. ఈ రెండింటినీ ఐసీజే తోసిపుచ్చింది. వివిధ దేశాల్లో దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి హక్కులు, దౌత్యపరమైన రక్షణలు ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిన ఉండాలనే ఉద్దేశంతో వియన్నాలో 1963లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 1967 మార్చి 19 నుంచి వియన్నా ఒప్పందం (Vienna Convention on Consular Relations, 1963 )అమలులోకి వచ్చింది. దీనిపై భారత్ పాకిస్తాన్ 1969 ఏప్రిల్ 14, 1977 నవంబర్ 28న సంతకాలు చేశాయి.
ఐసీజే పరిధిపై...
‘వియన్నా ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ఏదైనా వివాదం వస్తే, అది తప్పనిసరిగా ఐసీజే పరిధిలోకే వస్తుంది. ఇరుపార్టీల్లో ఎవరైనా ఐసీజేను ఆశ్రయించవచ్చు’ అనేది ఒప్పందంలోని ఓ నిబంధన. దీని మూలంగానే పాక్ మొదటి వాదన వీగిపోయింది.
వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ఏంటంటే..
స్వదేశస్తులకు సంబంధించి దౌత్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడానికి వీలుగా...
- సొంత దేశానికి చెందిన వ్యక్తులను కలుసుకోవడానికి దౌత్య సిబ్బందికి, తమ దేశ దౌత్యవేత్తలను సంప్రదించడానికి ఆ దేశంలోని విదేశీయులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి.
- ఏ దేశంలోనైనా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా, అరెస్టు చేసినా... సదరు వ్యక్తి కోరుకుంటే తక్షణం ఈ సమాచారాన్ని అతని దేశ రాయబార కార్యాలయానికి చేరవేయాలి.
- అరెస్టయిన వ్యక్తి రాయబార కార్యాలయానికి రాసే లేఖలను వెంటనే పంపాలి. అతినికున్న హక్కుల గురించి స్పష్టంగా చెప్పాలి.
- అరెస్టయిన తమ దేశస్తుడిని జైలులో కలుసుకొనే, మాట్లాడే హక్కు దౌత్య సిబ్బందికి ఉంటుంది. అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ న్యాయ సహాయాన్ని కూడా అందించవచ్చు.
ఎవరైనా వ్యక్తి ఫలానా నేరాల కింద అరెస్టయితే... ఆ దేశ దౌత్య సిబ్బందికి పై హక్కులు ఉండవని ఎక్కడా పేర్కొనలేదు. అందుకే గూఢచర్యం కింద అరెస్టయితే దౌత్య సిబ్బందికి హక్కులుండవనే పాక్ రెండో వాదన వీగిపోయింది.
ఎందుకు కలవనివ్వట్లేదు?
జాధవ్‌ను కలవడానికి అనుమతించాలని భారత్ ఎంత గట్టిగా డిమాండ్ చేసినా పాక్ ఎందుకు ససేమిరా అంటోందంటే, అతనిపై విచారణ మిలటరీ కోర్టులో రహస్యంగా జరిగింది. జాధవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను పాక్ చూపడం లేదు. ఆయనతో బలవంతంగా ఒప్పించిన వీడియో మాత్రమే పాక్ వద్ద ఉంది. ఒకవేళ భారత దౌత్య సిబ్బంది జాధవ్‌ను కలిస్తే అసలు జరిగిందేమిటో ఆయన వివరిస్తాడు. పైగా దౌత్య సిబ్బంది అతనితో మాట్లాడితే న్యాయ సహాయమూ అందుతుంది. అందుకనే పాక్ భారత దౌత్య సిబ్బందికి జాదవ్‌ను కలిసే అవకాశమివ్వడం లేదు.
అంతర్జాతీయ నాయస్థానం విధులు విధానాలు
హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కుల్‌భూషణ్ జాధవ్ కేసుతో ఈ న్యాయస్థానం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఐసీజే ఏర్పాటు, విధి విధానాలపై సమగ్ర విశ్లేషణ మీకోసం....
ఐసీజే ఏర్పాటు
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన న్యాయ సంస్థగా 1945 జూన్‌లో నెదర్లాండ్‌సలోని దక్షిణ హాలండ్ ప్రావిన్సు, ద హేగ్ నగరంలోని శాంతి సౌధంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఏర్పాటైంది. ఐరాస ఆరు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఈ ప్రపంచ న్యాయస్థానం ఒక్కటే న్యూయార్క్ వెలుపల ఉండడం విశేషం.
ఐసీజే విధులు
సభ్య దేశాలు నివేదించిన న్యాయపరమైన వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరించడం దీని బాధ్యత. ఐరాస అధికార విభాగాలు, ప్రత్యేక సంస్థలు అడిగిన న్యాయపరమైన అంశాలపై ఇది సలహాపూర్వకమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంది. ఇలా రెండు రకాల విచారణ పరిధి ఐసీజేకు కల్పించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా మొత్తం 15 మంది ఎన్నికై న న్యాయమూర్తులతో ఐసీజే పనిచేస్తుంది. ఐసీజే జడ్జీలను ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఎన్నుకుంటాయి. ఈ రెండు సంస్థల సంయుక్త సమావేశాల్లో, విడివిడి సమావేశాల్లో పూర్తి మెజారిటీ వచ్చిన వారే న్యాయమూర్తులుగా ఎన్నికవుతారు. ఐసీజే ప్రస్తుత అధ్యక్షుడు రోనీ అబ్రహాం ఫ్రాన్‌సకు చెందిన న్యాయకోవిదుడు.
ఐసీజే జడ్జీగా ఎన్నికై తే స్వతంత్రులే...
ఒకసారి ఐసీజే జడ్జీగా ఎన్నికై న తర్వాత ఎవరూ కూడా వారి దేశాల ప్రభుత్వాలకుగానీ, మరేదైనా దేశాల(ప్రభుత్వాల)కుగానీ ప్రతినిధులు కారు. ఐరాస ఇతర విభాగాల్లో దేశాల ప్రతినిధులుంటారు. ఈ జడ్జీలు మాత్రం స్వతంత్రులు. ఏక కాలంలో ఒకే దేశానికి చెందిన ఇద్దరు జడ్జీలుగా ఉండడానికి వీల్లేదు. భద్రతా మండలిలో సభ్యత్వం మాదిరిగానే ఆఫ్రికా నుంచి ముగ్గురు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల నుంచి ఇద్దరు, ఆసియా నుంచి ముగ్గురు, తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇద్దరు, పశ్చిమ ఐరోపాతోపాటు పలు ఇతర దేశాల నుంచి ఐదుగురు, చొప్పున జడ్జీలు ఐసీజేలో ఉంటారు.
జడ్జీలుగా చేసిన భారతీయులు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దల్వీర్ భండారీ ఐసీజే ప్రస్తుత 15 మంది జడ్జీల్లో ఒకరు. ఆయన 2012లో ఎన్నికయ్యారు. ఆయనకు ముందు భారత్‌కు చెందిన సర్ బెనెగళ్ నర్సింగ్‌రావు(1952-53), డా.నాగేంద్రసింగ్(1973-88), ఆర్‌ఎస్ పాఠక్(1988-90) ఐసీజే జడ్జీలుగా పనిచేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కూడా పనిచేసిన నాగేంద్రసింగ్ 1985-88 మధ్య మూడేళ్లు ప్రపంచ కోర్టు ప్రెసిడెంట్‌గా సేవలందించడం విశేషం. 1950లో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి ఎంసీ చాగ్లా, 2002లో సుప్రీంకోర్టు మాజీ జడ్జీ బీపీ జీవన్‌రెడ్డిలు ఐసీజే తాత్కాలిక(అడ్‌హాక్) జడ్జీలుగా పనిచేశారు.
ఐసీజే అధ్యక్షుడు - రోని అబ్రహం ( 2015 ఫిబ్రవరి 6 - 2018 ఫిబ్రవరి 5 )
ఐసీజే ఉపాధ్యక్షుడు - అబ్దుల్‌కావీ యూసఫ్(2015 ఫిబ్రవరి 6 - 2018 ఫిబ్రవరి 5 )
జనసాంద్రత లో ముంబైకి మొదటి స్థానం
జనసాంద్రత పరంగా ముంబై దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు నగరాలు నిలిచాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. హెచ్‌ఎండీకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సంస్థ లీ అసోసియేట్స్ మే 20న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
నివేదిక ప్రకారం ముంబైలో చదరపు కిలోమీటర్‌కు 21,000 మంది నివసిస్తుండగా, దేశ రాజధాని ఢిల్లీలో 20,932 మంది, హైదరాబాద్‌లో 10,263 మంది నివసిస్తున్నారు. సింగపూర్‌లో చ.కి.మీ.కు 7,801, టొరంటోలో 4,334 మంది మాత్రమే ఉన్నారు.
నగరాల వారీగా జనసాంద్రత

నగరం | విస్తీర్ణం (చ.కి.మీ.) | జనాభా | జన సాంద్రత (చ.కి.మీ.కు) |
ముంబై | 603 | 1.24 కోట్లు | 21,000 |
ఢిల్లీ | 782 | 1.63 కోట్లు | 20,932 |
బెంగళూరు | 709 | 84 లక్షలు | 11,909 |
హైదరాబాద్ | 680 | 69 లక్షలు | 10,263 |
సింగపూర్ | 719 | 56 లక్షలు | 7,801 |
టోరంటో | 630 | 27 లక్షలు | 4,334 |
క్విక్ రివ్యూ:
ఏమిటి : జనసాంద్రతలో ముంబైకి మొదటిస్థానం
ఎప్పుడు : మే 20
ఎవరు : లీ అసోసియేట్స్
అమర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారామిలటరీ జవాన్ల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారాన్ని అందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) శరాతంగ్ పోస్ట్‌లో మే 20న నిర్వహించిన ‘సైనిక్ సమ్మేళన్’లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పారామిలిటరీ బలగాల్లోని 34,000 కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించామని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరుల కుటుంబాలకు రూ. కోటి
ఎప్పుడు : మే 20
ఎవరు : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎందుకు : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు
దేశంలోని మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగం
సోషల్ మీడియా వినియోగంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై మహానగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ 4వ స్థానంలో నిలవగా.. ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో కోల్‌కతా నిలిచింది. దేశంలోని మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగంపై సర్వే నిర్వహించిన సోషల్ మీడియా ట్రెండ్స్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.
కోటి జనాభాకు చేరువైన హైదరాబాద్ మహానగరంలో సుమారు 40 లక్షల మంది సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. హైదరాబాద్ నగరవాసులు ప్రధానంగా వాట్సాప్, ఫేస్‌బుక్ సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగం
ఎవరు : సోషల్ మీడియా ట్రెండ్స్ సర్వే
ఎక్కడ : భారత్‌లో
భారీ నౌకాదళ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం
రూ. 20వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రైవేటు రంగంలో నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దాదాపు 30వేల టన్నుల నుంచి 40 వేల టన్నుల సామర్థ్యంతో ఈ నౌకలు ఉండనున్నాయి. ప్రైవేటు రంగంలో చేపట్టనున్న అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అనుమతులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెండు నౌకల నిర్మాణ బాధ్యతలను విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌కు, మరో రెండు నౌకల బాధ్యతలను ఇతర సంస్థలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ రంగంలో చేపట్టనున్న అతిపెద్ద ప్రైవేటు ప్రాజెక్టు
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి
తలాక్‌కు సంఘ బహిష్కరణ : ఐఏఎంపీఎల్‌బీ
ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లింలకు సంఘ బహిష్కరణ విధించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఐఏఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఈ మేరకు ట్రిపుల్ తలాక్ పాటించొద్దంటూ పెళ్లికొడులకు చెప్పాలని ఖాజీలకు సలహావళి జారీ చేస్తామని మే 22న సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌లో తెలిపింది. షరియత్ ప్రకారం ట్రిపుల్ తలాక్ అవాంఛనీయమని, భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి భార్యాభర్తల కోసం షరియత్‌కు అనుగుణంగా ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది.
భార్యాభర్తల వివాద పరిష్కారానికి నియమావళి జారీ

- వివాదాన్ని భార్యాభర్తలు తొలుత పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. చేసిన తప్పులను మరచిపోయేందుకు యత్నించాలి. ఫలితం లేకపోతే తాత్కాలికంగా విడిగా ఉండాలి.
- అలా పరిష్కారం కాకపోతే ఇద్దరి తరఫు కుటుంబాల్లోని పెద్దలు రాజీకి ప్రయత్నించాలి. ఫలితం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అప్పుడు కూడా తలాక్ అని ఒకసారి మాత్రమే చెప్పాలి. ఇద్దత్ (వేచి ఉండే కాలం) వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఇద్దత్‌లో సమస్య పరిష్కారమైతే తిరిగి భార్యాభర్తలుగా జీవించవచ్చు. పరిష్కారం కాకపోతే ఇద్దత్ ముగిశాక వివాహం రద్దు అవుతుంది.
- ఇద్దత్ కాలంలో భార్య గర్భిణి అయితే ఇద్దత్‌ను ప్రసవం వరకు పొడిగించాలి. ఇద్దత్ తర్వాత రాజీ కుదిరితే విడిపోయిన జంట మళ్లీ పెళ్లాడి వివాహాన్ని పునరుద్ధరించుకోవచ్చు.
- విడాకులకు మరో పద్ధతినీ అనుసరించవచ్చు. తొలి తలాక్ చెప్పిన తర్వాత, రెండో నెలలో మరో తలాక్, మూడో నెలలో మరో తలాక్ చెప్పి తద్వారా విడాకులు పొందొచ్చు. మూడో తలాక్ ముందు రాజీ కుదిరితే తిరిగి భార్యాభర్తలుగా ఉండొచ్చు. భర్తతో కలసి ఉండటం ఇష్టం లేకపోతే భార్య ‘ఖులా’ ద్వారా విడాకులు పొందొచ్చు.
ఏమిటి : తలాక్‌కు సంఘ బహిష్కరణ విధించాలన్న ఐఏఎంపీఎల్‌బీ
ఎప్పుడు : మే 22
ఎవరు : సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పణ
దేశంలో తొలి లగ్జరీ రైలు తేజస్ ప్రారంభం
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తేజస్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలెక్కింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్, గోవాలోని కర్మాలి స్టేషన్ల మధ్య నడిచే తొలి తేజస్ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మే 22న ముంబైలో జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 200 కి.మీ. వేగంతో వెళ్లగల ఈ రైలు ప్రస్తుతానికి 130 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ 630 కి.మీ దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుంటుంది. వర్షాకాలం తప్ప మిగిలిన రోజుల్లో ముంబై-గోవాల మధ్య వారానికి ఐదు రోజులు, వర్షాకాలంలో వారానికి మూడు రోజులు ఈ రైలు నడవనుంది. మొత్తం 20 బోగీలు ఉంటాయి. రైలు బోగీలను పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. భారతీయ రైల్వేలో ఇప్పటికి ఇదే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు.
తేజస్ రైలు ప్రత్యేకతలు
- భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన రైలు. ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్‌స, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు.
- ఇది పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారైంది. ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు. దుమ్ము, ధూళి కూడా అంటుకోదు.
- ముంబై నుంచి గోవా వరకు చార్జీ రూ. 2,585. ఆహారంతో కలిపి అయితే రూ. 2,740. సాధారణ చెయిర్‌కార్‌లో రూ. 1,185, ఆహారంతో కలిపి అయితే రూ. 1,310.
- సీట్లను అత్యంత అధునాతన డిజైన్‌తో తయారు చేశారు. రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులుండవు. అలసట ఉండదు.
- ఈ రైల్లో అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్ టెక్నాలజీ ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపేందుకు అవకాశం.
- ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ద్వారా రైలు ఎక్కడుందో సులభంగా తెలుస్తుంది. వికలాంగులకు బ్రెయిలీ లిపిలో సమాచారాన్ని ఏర్పాటు చేశారు.
ఏమిటి : లగ్జరీ రైలు తేజస్ ప్రారంభం
ఎప్పుడు : మే 22
ఎవరు : కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
ఎక్కడ : ముంబై - గోవా మధ్య
యూపీలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా హెల్మెట్ లేనివారికి పెట్రోల్ విక్రయించొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని లక్నోలో మే 22 నుంచి నో హెల్మెట్ - నో ఫ్యూయల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి ఇంధనం విక్రయించకూడదని లక్నోలోని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించిన ప్రభుత్వం.. అలా వచ్చే వారి బైక్ నంబర్లను నోట్ చేసి పోలీసులకు ఇవ్వాలని సూచించింది. ఇది విజయవంతమైతే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తారు.
2016లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నో హెల్మెట్ - నో ఫ్యూయల్ విధానం
ఎప్పుడు : మే 22
ఎవరు : యూపీ ప్రభుత్వం
ఎక్కడ : లక్నోలో
ఎందుకు : రహదారి ప్రమాదాల నివారణకు
పరిశోధనకు ‘వజ్ర’ కార్యక్రమం
భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ శాస్త్రవేత్తలు మూడు నెలలు పనిచేసేలా కేంద్రం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది. ‘విజిటింగ్ అడ్వాన్‌సడ్ జాయింట్ రీసెర్చ్’(వజ్ర)గా పిలిచే ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తారు. విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో పనిచేసేలా ప్రోత్సహించడంతో పాటు, మన పరిశోధక విద్యార్థులకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ‘మన విద్యార్థులకు విదేశీ పరిశోధన సంస్కృతిని పరిచయం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. శాస్త్రవేత్తలు తొలి నెల్లో 9.72 లక్షలు, తర్వాత నెలకు 6.48 లక్షలు వేతనంగా పొందుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశీయ శాస్త్ర సంస్థల్లో పరిశోధనకు వజ్ర కార్యక్రమం
ఎవరు : కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ శాస్త్రవేత్తలు మూడు నెలలు పనిచేసేందుకు
దేశీయ వలసల్లో 3వ స్థానం
అంతర్గత వలసలు అధికంగా నమోదవుతున్న మూడో దేశంగా భారత్ నిలిచింది. 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోని(భారత్‌లో) వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారని అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం(ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి(ఎన్‌ఆర్‌సీ).. మే 22న విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. దీని ప్రకారం అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలస వెళ్లగా, 59 లక్షల మందితో ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానంలో ఉంది.
సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రారంభం
సుప్రీం కోర్టులో సమగ్ర కేసు సమాచార నిర్వహణ వ్యవస్థ (integrated case management system) అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మే 10న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా డిజిటల్ ఫైలింగ్ చేసిన కేసు వివరాలను దేశంలో ఉన్న 24 హైకోర్టులతో పాటు సబార్డినేట్ కోర్టులతో అనుసంధానం చేస్తారు.
ఈ వ్యవస్థ ద్వారా కక్షిదారులు కేసుకు సంబంధించిన వివరాలను పొందటంతోపాటు ఆన్‌లైన్‌లోనే కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టులో సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు : మే 10
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : కేసుల వివరాల డిజిటిల్ ఫైలింగ్ కోసం
ట్రిపుల్ తలాక్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మే 11న విచారణ ప్రారంభించింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించమని తెలిపింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే దానిపై చర్చ జరుగుతుందని.. ఇది ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్ధారణ అయితే దీని రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) సభ్యులుగా (ఒక్కో మతం నుంచి ఒక్కరు) ఉన్నారు.
ట్రిపుల్ తలాక్ ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకం అని సైరా బానో అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రిపుల్ తలాక్‌పై విచారణ ప్రారంభం
ఎప్పుడు : మే 11
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్ధతను నిర్ధారించడానికి
విద్యుదీకరణపై ప్రధాని సమీక్ష
విద్యుదీకరణ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 9న సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 18,452 గ్రామాలకుగాను 13 వేల గ్రామాలకు విద్యుదీకరణ పూర్తైదని, లక్ష్యం ప్రకారం 1000 రోజుల్లో అన్ని గ్రామాలకు విద్యుదీకరణను పూర్తి చేస్తామని ప్రధానమంత్రికి అధికారులు వివరించారు.
చార్‌ధామ్‌కు రైలు మార్గంపై సర్వే పూర్తి
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ (యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్- బద్రీనాథ్) పుణ్య క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే రైల్వే మార్గం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రైల్వే వికాస్ నిగమ్ దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేసింది. మొత్తం 327 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ.43292 కోట్ల వ్యయంతో (అంచనా) నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చార్‌దామ్‌కు రైలు మార్గం
ఎప్పుడు : ప్రతిపాదించి సర్వే పూర్తిచేశారు
ఎవరు : రైల్వే మంత్రిత్వ శాఖ
ఫిట్ ఇండియా సర్వే - 2017
దేశంలో 20 - 25 ఏళ్ల మధ్య వయసున్న యువతలో 6.5 మంది వ్యాయామాలపై అవగాహన కలిగి ఉన్నారని రీబాక్ సంస్థ వెల్లడించింది. వ్యాయామం విషయంలో భారతీయుల ఆలోచనలు, అలవాట్లను గుర్తించేందుకు ‘ఫిట్ ఇండియా’ పేరిట ఒక సర్వే నిర్వహించిన సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది మహా నగరాల్లో 20-25 మధ్య వయసున్న 1,500 మందిని సర్వే చేయడం ద్వారా రీబాక్ ఈ ఫలితాలను రాబట్టింది.
సర్వే వివరాలు
- ఫిట్‌నెస్‌పై అవగాహన విషయంలో పుణె అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం స్కోరు 7.6 కాగా చండీగఢ్ 7.3 స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. కోల్‌కతా (6.71), ఢిల్లీ/ఎన్‌సీఆర్ (6.68), హైదరాబాద్ (6.6), బెంగళూరు (6.34), చెన్నై (6.21) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- ఈ తరం యువత అత్యధికంగా పాల్గొనే ఫిట్‌నెస్ కార్యక్రమం ‘యోగా’. బెంగళూరులో అత్యధికులు (74 శాతం) యోగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంఖ్య చెన్నైలో 71 శాతంగా, హైదరాబాద్‌లో 67 శాతంగా ఉంది.
- వ్యాయామానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అత్యధికులు యూట్యూబ్‌పై ఆధారపడుతున్నారు. సర్వే చేసిన వారిలో 69 శాతం మంది హైదరాబాదీలు యూట్యూబ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య బెంగళూరులో 68 శాతం.. చెన్నైలో 58 శాతం మాత్రమే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిట్ ఇండియా సర్వే - 2017
ఎప్పుడు : మే 12
ఎవరు : రీబాక్
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : వ్యాయామంపై భారతీయుల ఆలోచనలు తెలుసుకునేందుకు
‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం : సుప్రీంకోర్టు
ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మే 12న జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివేదించడంతో ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.
పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017
పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ తేల్చింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన సంస్థ 10 అంశాలను నేపథ్యంగా తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాల పాలనా తీరుపై పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్-2017ను విడుదల చేసింది. ఈ నివేదికలో పాలనాపరంగా కేరళ, తమిళనాడు, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలవగా.. తెలంగాణ 20వ స్థానంలో ఉంది.
అవసరమైన మౌలిక వసతులు, మానవ అభివృద్ధికి మద్దతు, సామాజిక రక్షణ, మహిళలు-పిల్లలు, న్యాయ పరిష్కార సేవలు, నేరా లు-శాంతిభద్రతలు, పర్యావరణం, పారదర్శకత-జవాబుదారీతనం, ద్రవ్య నిర్వహణ, ఆర్థిక స్వేచ్ఛ అంశాలతో కూడిన 10 నేపథ్యాలను పరిశీలించి ఈ సంస్థ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది.
ద్రవ్య నిర్వహణలో తెలంగాణ ఫస్ట్.. ఏపీకి 28
రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం పెరుగుదల తదితర విషయాలతో కూడిన ‘ద్రవ్య నిర్వహణ’లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. ఏపీ 28వ స్థానంలో నిలిచింది.
ఏ అంశంలో ఏ స్థానం..
ఏమిటి : పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : మే 15
ఎవరు : పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్
ఎందుకు : పాలనలోని వివిధ అంశాల్లో రాష్ట్రాలకు ర్యాంకింగ్స్
నమామి దేవి నర్మదే సేవా యాత్ర ముగింపు
నర్మదా నది పరిరక్షణ కోసం చేపట్టిన నమామి దేవి నర్మదే సేవా యాత్ర మే 15న ముగిసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నర్మదా నది సంరక్షణకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడాన్ని ‘భవిష్యత్ దృష్టితో చేసిన సరైన కార్యక్రమం’ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ముందు నర్మదా నది జన్మస్థానమైన అమర్‌కంఠక్ వద్ద మోదీ పూజలు నిర్వహించారు.
నమామి దేవి నర్మదే సేవా యాత్రను 2016 డిసెంబర్ 11న అమర్‌కంఠక్‌లో ప్రారంభించారు. సుమారు 150 రోజుల పాటు సాగిన ఈ యాత్ర 1100 ఊళ్ల మీదుగా 3,344 కి.మీ., పాటు సాగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నమామి దేవి నర్మదే సేవా యాత్ర ముగింపు
ఎప్పుడు : మే 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో
ఎందుకు : నర్మదా నది రక్షణ కోసం
చెన్నైలో భూగర్భ మెట్రో రైలు సేవలు ప్రారంభం
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయడు మే 14న చెన్నైలో (తిరుమంగళంలో) భూగర్భ మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ప్రజలు తరలివెళ్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
చక్కెర సబ్సిడీ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
పేదలకు అంత్యోదయ అన్న యోజన కింద ఇచ్చే చక్కెర సబ్సిడీని కేంద్రం పునరుద్ధరించింది. ఈ మేరకు మే 3న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కేజీ చక్కెరపై రూ.18.50 సబ్సిడీని రాష్ట్రాలకు అందించడానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల కేంద్రంపై రూ.550 కోట్ల భారం పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చక్కెర సబ్సిడీ పునరుద్ధరణకు ఆమోదం
ఎప్పుడు : మే 3
ఎవరు : కేంద్ర కేబినెట్
దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ప్రారంభం
భారత్‌లోనే తొలి ప్రైవేటు ఆయుధ కార్మాగారం మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఈ మేరకు భిండ్ జిల్లా మలన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కర్మాగారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మే 4న ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పుంజ్ లాయిడ్ రక్ష సిస్టమ్స్ (భారత్), ఇజ్రాయిల్ వెపన్ సిస్టమ్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ఈ కర్మాగారం ద్వారా ఎక్స్95 కార్బైన్ అండ్ అసాల్ట్ రైఫిల్, గాలిల్ స్నైపర్ రైఫిల్, తావోర్ అసాల్ట్ రైఫిల్, నెగేవ్ లైట్ మెషిన్‌గన్‌లను ఉత్పత్తి చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ప్రారంభం
ఎప్పుడు : మే 4
ఎవరు : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లోని మలన్‌పూర్‌లో
ఎందుకు : మేక్ ఇన్ ఇండియాలో భాగంగా
బిల్కిస్ బానో కేసులో 12 మందికి జీవిత ఖైదు
గుజరాత్‌లో సంచలనం రేపిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు మే 4న తీర్పు వెలువరించిన న్యాయస్థానం దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదేసమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులు, వైద్యులను నిర్దోషులుగా ప్రకటించిన కింది కోర్టు తీర్పును పక్కనబెట్టింది. కాగా, ఈ ఏడుగురూ ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని శిక్షాకాలంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
2002 గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్‌లోని బిల్కిస్ ఇంటిపై దాడి చేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబ సభ్యులైన ఏడుగురిని హతమార్చారు. ఈ కేసులో 2008లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్కిస్ బానో కేసులో 12 మందికి జీవిత ఖైదు
ఎప్పుడు : మే 4
ఎవరు : బాంబే హైకోర్టు
‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష విధించిన సుప్రీం కోర్టు
నిర్భయ కేసులో నలుగురు హంతకులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు దోషులు ముకేశ్ (29), పవన్ (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31)లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ మే 5న తీర్పు వెలువరించింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా.. పాశవిక, అమానవీయ, అత్యంత దుర్మార్గమైన దాడిగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం అభివర్ణించింది.
2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి దోషులు ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయటంతోపాటు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టుని తీర్పుని సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా ఈ రెండు కోర్టుల తీర్పులని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో మరో దోషి రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా బాలనేరస్తుడు మూడేళ్ల జైలుశిక్ష అనంతరం జువెనైల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు
ఎప్పుడు : మే 5
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : డిసెంబర్ 16, 2012 నాటి నిర్భయ కేసులో
హెచ్‌ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్ జారీకి సుప్రీం ఆదేశం
ప్రాణాంతకర హెచ్‌ఐవీ సోకిన చిన్నారులను సైతం బలహీనవర్గాల జాబితా (డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్)లో చేరుస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని సుప్రీంకోర్టు మే 5న ఆదేశించింది. చిన్నారులకు ఉచిత, నిర్భంద విద్యా హక్కు కల్పిస్తూ 2009లో తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్‌లో చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కొత్త నోటిఫికేషన్ తెచ్చాయని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అదేబాటలో నడవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌మినహా మిగతావన్నీ వచ్చే ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్ జారీచేయాలని కోర్టు నిర్దేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్
ఎప్పుడు : మే 5
ఎవరు : రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఎందుకు : చిన్నారులను బలహీనవర్గాల జాబితాలో చేర్చేందుకు
దాణా కేసులో 9 నెలల్లో విచారణ ముగించాలన్న సుప్రీంకోర్టు
దాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగు కేసుల్లో వేర్వేరుగా విచారణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు లాలూపై నేరపూరిత కుట్ర అభియోగాలను కొట్టేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతూ మే 8న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే లాలూతో పాటు మిగిలిన నిందితులపై విచారణ ప్రక్రియను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం చోటు చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లాలూపై నాలుగు కేసుల్లో విచారణకు ఆదేశం
ఎప్పుడు : మే 8
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : దాణా కుంభకోణానికి సంబంధించి
మావోయిస్టుల అణచివేతకు ‘సమాధాన్’ వ్యూహం
మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సదస్సు రెండ్రోజుల పాటు ( మే 8 - 9 ) న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మావోయిస్టుల అణచివేసేందుకు ‘సమాధాన్’ (SAMADHAN) వ్యూహాన్ని వివరించారు. నక్సల్స్ విషయంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే ప్రధాన లక్ష్యమని రాజ్‌నాథ్ చెప్పారు.
సమాధాన్ వ్యూహం..
S- Smart Leadership
A - Agressive Strategy
M - Motivation and Training
A - Actionable Intelligence
D - Dashboard Key Performance Indicators (KPI), Key Resuly Area (KRA)
H - Harnessing Technology
A - Action Plan for Each Theatre
N - No Access to Finance
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ ‘సమాధాన్’ వ్యూహం
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : మావోయిస్టుల అణచివేతకు
మధ్యప్రదేశ్ బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో మార్పు
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌తో కాకుండా.. జనవరితో మొదలుపెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మే 2న నిర్ణయించింది. ఇటీవల నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్ విధానానికి మార్చాలనే ఆలోచనకు ప్రధాని నరేంద్రమోదీ మద్దతు పలికిన నేపథ్యంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
10 ఏళ్లలో 2.37 కోట్లు పెరిగిన పత్రికల ప్రతులు
భారత్‌లో పదేళ్లలో పత్రికల ప్రతుల సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదల నమోదైందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) వెల్లడించింది. ఈ మేరకు మే 8న ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం పత్రికల వార్షిక వృద్ధిరేటు 4.87 శాతంగా ఉంది. 2006లో ప్రతుల సంఖ్య రోజుకు 3.91 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది 6.28 కోట్లకు చేరింది.
అక్షరాస్యత పెరగడం, పత్రికా పఠనం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారడం, పత్రికలు, వాటి ధరలు అందుబాటులో ఉండడంతో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతోందని ఏబీసీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 ఏళ్లలో 2.37 కోట్లు పెరిగిన పత్రికల ప్రతులు
ఎప్పుడు : మే 8
ఎవరు : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్
ఎక్కడ : భారత్‌లో
రామానుజాచార్య స్టాంప్ ఆవిష్కరణ
రామానుజాచార్య సహస్రాబ్ది (1000వ జన్మదిన వేడుకలు) ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూపొందించిన తపాలా బిళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 1న ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రామానుజాచార్య తొలి తపాలాబిళ్లను ప్రధాని చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామానుజాచార్య స్టాంప్ ఆవిష్కరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : ప్రధాని మోదీ
ఎందుకు : రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా
రెండో ఎత్తైన జెండా ఆవిష్కరణ
దేశంలోనే రెండో ఎత్తైన జెండాను మే 1న మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నెలకొల్పారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్ కేఎస్‌బీపీ ట్రస్టు ఏర్పాటు చేసిన 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా పొడవు 90 అడుగులు కాగా వెడల్పు 60 అడుగులు. దేశంలో ఎత్తైన జెండా భారత్, పాక్ సరిహద్దులో అట్టారి వద్ద (360 అడుగులు) ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే రెండో ఎత్తై జెండా ఆవిష్కరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : కేఎస్‌బీపీ ట్రస్టు
ఎక్కడ : కొల్హాపూర్, మహారాష్ట్ర

- పారిశ్రామిక ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన తదితర ‘ఆర్థిక స్వేచ్ఛ’ అంశంలో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో నిలిచాయి.
- విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, గృహ నిర్మాణం తదితర ‘అవసరమైన మౌలిక వసతులు’ అంశంలో ఏపీ 6, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి.
- విద్య, ఆరోగ్యం తదితర అంశాలతో కూడిన ‘మానవ అభివృద్ధికి చేయూత’లో ఏపీ 17, తెలంగాణ 26వ స్థానం దక్కాయి.
- ప్రజాపంపిణీ వ్యవస్థ, సామాజిక న్యాయం-సాధికారత, మైనారిటీల సంక్షేమం, ఉపాధి కల్పన తదితర ‘సామాజిక భద్రత’ అంశంలో ఏపీ 24, తెలంగాణ చివరన 30వ స్థానంలో నిలిచాయి.
- పిల్లలపై నేరాలు, బాలకార్మికులు, ఐసీడీఎస్ లబ్ధిదారుల శాతం, లింగ నిష్పత్తి, పౌష్టికాహార లోపం, ఆసుపత్రుల్లో ప్రసవాలు తదితర ‘మహిళలు-పిల్లలు’ అంశంలో ఏపీ 19, తెలంగాణ 21వ స్థానంలో ఉన్నాయి.
- అత్యాచారాలు, హత్యలు, వరకట్న బాధిత చావులు, కస్టోడియల్ మరణాలు, పోలీసు సిబ్బంది సంఖ్య తదితర విషయాలను పరిశీలించే ‘నేరాలు, శాంతిభద్రతలు’ అంశంలో ఏపీ 11, తెలంగాణ 21 స్థానంలో నిలిచాయి.
- కేసుల పెండెన్సీ, న్యాయాధికారుల ఖాళీలు, అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తదితర అంశాలతో కూడిన ‘న్యాయ సేవల పరిష్కారం’లో ఏపీ 23, తెలంగాణ 21వ స్థానాలతో వెనకపడ్డాయి.
- కాలుష్యం, పర్యారణ ఉల్లంఘనలు, అటవీ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వంటి అంశాలున్న ‘పర్యావరణం’లో ఏపీ 20, తెలంగాణ 28వ స్థానంలో నిలిచాయి.
- ఈ-గవర్నెన్స్ సేవలు, ఆర్‌టీఐ, లోకాయుక్త చట్టం, ఏసీబీ కేసుల పరిష్కారం, ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డులు తదితర విషయాలపై పరిశీలన చేసిన ‘పారదర్శకత, జవాబుదారీతనం’ అంశంలో ఏపీ 23, తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.
ఏమిటి : పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017
ఎప్పుడు : మే 15
ఎవరు : పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్
ఎందుకు : పాలనలోని వివిధ అంశాల్లో రాష్ట్రాలకు ర్యాంకింగ్స్
నమామి దేవి నర్మదే సేవా యాత్ర ముగింపు
నర్మదా నది పరిరక్షణ కోసం చేపట్టిన నమామి దేవి నర్మదే సేవా యాత్ర మే 15న ముగిసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నర్మదా నది సంరక్షణకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడాన్ని ‘భవిష్యత్ దృష్టితో చేసిన సరైన కార్యక్రమం’ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ముందు నర్మదా నది జన్మస్థానమైన అమర్‌కంఠక్ వద్ద మోదీ పూజలు నిర్వహించారు.
నమామి దేవి నర్మదే సేవా యాత్రను 2016 డిసెంబర్ 11న అమర్‌కంఠక్‌లో ప్రారంభించారు. సుమారు 150 రోజుల పాటు సాగిన ఈ యాత్ర 1100 ఊళ్ల మీదుగా 3,344 కి.మీ., పాటు సాగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నమామి దేవి నర్మదే సేవా యాత్ర ముగింపు
ఎప్పుడు : మే 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో
ఎందుకు : నర్మదా నది రక్షణ కోసం
చెన్నైలో భూగర్భ మెట్రో రైలు సేవలు ప్రారంభం
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయడు మే 14న చెన్నైలో (తిరుమంగళంలో) భూగర్భ మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ప్రజలు తరలివెళ్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.
చక్కెర సబ్సిడీ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
పేదలకు అంత్యోదయ అన్న యోజన కింద ఇచ్చే చక్కెర సబ్సిడీని కేంద్రం పునరుద్ధరించింది. ఈ మేరకు మే 3న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కేజీ చక్కెరపై రూ.18.50 సబ్సిడీని రాష్ట్రాలకు అందించడానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల కేంద్రంపై రూ.550 కోట్ల భారం పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చక్కెర సబ్సిడీ పునరుద్ధరణకు ఆమోదం
ఎప్పుడు : మే 3
ఎవరు : కేంద్ర కేబినెట్
దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ప్రారంభం
భారత్‌లోనే తొలి ప్రైవేటు ఆయుధ కార్మాగారం మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఈ మేరకు భిండ్ జిల్లా మలన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కర్మాగారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మే 4న ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పుంజ్ లాయిడ్ రక్ష సిస్టమ్స్ (భారత్), ఇజ్రాయిల్ వెపన్ సిస్టమ్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ఈ కర్మాగారం ద్వారా ఎక్స్95 కార్బైన్ అండ్ అసాల్ట్ రైఫిల్, గాలిల్ స్నైపర్ రైఫిల్, తావోర్ అసాల్ట్ రైఫిల్, నెగేవ్ లైట్ మెషిన్‌గన్‌లను ఉత్పత్తి చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ప్రారంభం
ఎప్పుడు : మే 4
ఎవరు : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
ఎక్కడ : మధ్యప్రదేశ్‌లోని మలన్‌పూర్‌లో
ఎందుకు : మేక్ ఇన్ ఇండియాలో భాగంగా
బిల్కిస్ బానో కేసులో 12 మందికి జీవిత ఖైదు
గుజరాత్‌లో సంచలనం రేపిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు మే 4న తీర్పు వెలువరించిన న్యాయస్థానం దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదేసమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులు, వైద్యులను నిర్దోషులుగా ప్రకటించిన కింది కోర్టు తీర్పును పక్కనబెట్టింది. కాగా, ఈ ఏడుగురూ ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని శిక్షాకాలంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
2002 గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్‌లోని బిల్కిస్ ఇంటిపై దాడి చేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబ సభ్యులైన ఏడుగురిని హతమార్చారు. ఈ కేసులో 2008లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్కిస్ బానో కేసులో 12 మందికి జీవిత ఖైదు
ఎప్పుడు : మే 4
ఎవరు : బాంబే హైకోర్టు
‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష విధించిన సుప్రీం కోర్టు
నిర్భయ కేసులో నలుగురు హంతకులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు దోషులు ముకేశ్ (29), పవన్ (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31)లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ మే 5న తీర్పు వెలువరించింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా.. పాశవిక, అమానవీయ, అత్యంత దుర్మార్గమైన దాడిగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం అభివర్ణించింది.
2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి దోషులు ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయటంతోపాటు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టుని తీర్పుని సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా ఈ రెండు కోర్టుల తీర్పులని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో మరో దోషి రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా బాలనేరస్తుడు మూడేళ్ల జైలుశిక్ష అనంతరం జువెనైల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు
ఎప్పుడు : మే 5
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : డిసెంబర్ 16, 2012 నాటి నిర్భయ కేసులో
హెచ్‌ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్ జారీకి సుప్రీం ఆదేశం
ప్రాణాంతకర హెచ్‌ఐవీ సోకిన చిన్నారులను సైతం బలహీనవర్గాల జాబితా (డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్)లో చేరుస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని సుప్రీంకోర్టు మే 5న ఆదేశించింది. చిన్నారులకు ఉచిత, నిర్భంద విద్యా హక్కు కల్పిస్తూ 2009లో తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్‌లో చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కొత్త నోటిఫికేషన్ తెచ్చాయని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అదేబాటలో నడవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌మినహా మిగతావన్నీ వచ్చే ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్ జారీచేయాలని కోర్టు నిర్దేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్
ఎప్పుడు : మే 5
ఎవరు : రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఎందుకు : చిన్నారులను బలహీనవర్గాల జాబితాలో చేర్చేందుకు
దాణా కేసులో 9 నెలల్లో విచారణ ముగించాలన్న సుప్రీంకోర్టు
దాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగు కేసుల్లో వేర్వేరుగా విచారణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు లాలూపై నేరపూరిత కుట్ర అభియోగాలను కొట్టేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతూ మే 8న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే లాలూతో పాటు మిగిలిన నిందితులపై విచారణ ప్రక్రియను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం చోటు చేసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లాలూపై నాలుగు కేసుల్లో విచారణకు ఆదేశం
ఎప్పుడు : మే 8
ఎవరు : సుప్రీం కోర్టు
ఎందుకు : దాణా కుంభకోణానికి సంబంధించి
మావోయిస్టుల అణచివేతకు ‘సమాధాన్’ వ్యూహం
మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సదస్సు రెండ్రోజుల పాటు ( మే 8 - 9 ) న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మావోయిస్టుల అణచివేసేందుకు ‘సమాధాన్’ (SAMADHAN) వ్యూహాన్ని వివరించారు. నక్సల్స్ విషయంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే ప్రధాన లక్ష్యమని రాజ్‌నాథ్ చెప్పారు.
సమాధాన్ వ్యూహం..
S- Smart Leadership
A - Agressive Strategy
M - Motivation and Training
A - Actionable Intelligence
D - Dashboard Key Performance Indicators (KPI), Key Resuly Area (KRA)
H - Harnessing Technology
A - Action Plan for Each Theatre
N - No Access to Finance
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ప్రభుత్వ ‘సమాధాన్’ వ్యూహం
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : మావోయిస్టుల అణచివేతకు
మధ్యప్రదేశ్ బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో మార్పు
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌తో కాకుండా.. జనవరితో మొదలుపెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మే 2న నిర్ణయించింది. ఇటీవల నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్ విధానానికి మార్చాలనే ఆలోచనకు ప్రధాని నరేంద్రమోదీ మద్దతు పలికిన నేపథ్యంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
10 ఏళ్లలో 2.37 కోట్లు పెరిగిన పత్రికల ప్రతులు
భారత్‌లో పదేళ్లలో పత్రికల ప్రతుల సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదల నమోదైందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) వెల్లడించింది. ఈ మేరకు మే 8న ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం పత్రికల వార్షిక వృద్ధిరేటు 4.87 శాతంగా ఉంది. 2006లో ప్రతుల సంఖ్య రోజుకు 3.91 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది 6.28 కోట్లకు చేరింది.
అక్షరాస్యత పెరగడం, పత్రికా పఠనం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారడం, పత్రికలు, వాటి ధరలు అందుబాటులో ఉండడంతో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతోందని ఏబీసీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10 ఏళ్లలో 2.37 కోట్లు పెరిగిన పత్రికల ప్రతులు
ఎప్పుడు : మే 8
ఎవరు : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్
ఎక్కడ : భారత్‌లో
రామానుజాచార్య స్టాంప్ ఆవిష్కరణ
రామానుజాచార్య సహస్రాబ్ది (1000వ జన్మదిన వేడుకలు) ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూపొందించిన తపాలా బిళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 1న ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రామానుజాచార్య తొలి తపాలాబిళ్లను ప్రధాని చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రామానుజాచార్య స్టాంప్ ఆవిష్కరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : ప్రధాని మోదీ
ఎందుకు : రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా
రెండో ఎత్తైన జెండా ఆవిష్కరణ
దేశంలోనే రెండో ఎత్తైన జెండాను మే 1న మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నెలకొల్పారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్ కేఎస్‌బీపీ ట్రస్టు ఏర్పాటు చేసిన 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా పొడవు 90 అడుగులు కాగా వెడల్పు 60 అడుగులు. దేశంలో ఎత్తైన జెండా భారత్, పాక్ సరిహద్దులో అట్టారి వద్ద (360 అడుగులు) ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే రెండో ఎత్తై జెండా ఆవిష్కరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : కేఎస్‌బీపీ ట్రస్టు
ఎక్కడ : కొల్హాపూర్, మహారాష్ట్ర
Published date : 13 May 2017 02:24PM