Skip to main content

Child marriages: బాల్య వివాహాల్లో జార్ఖండ్‌ టాప్‌

చిన్నతనంలోనే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లవుతున్నాయి.
Jharkhand tops in child marriages
Jharkhand tops in child marriages

ఈ విషయంలో దేశవ్యాప్త సరాసరి 1.9% కాగా, కేరళలో 0.0% గా ఉంది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన శాంపిల్‌ సర్వే–2020లో ఈ విషయం వెల్లడైంది. సర్వే వివరాలను రిజి్రస్టార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ వెల్లడించారు. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు పల్లెల్లో 7.3%, పట్టణ ప్రాంతాల్లో 3% జరుగుతున్నాయి. 21 ఏళ్లు రాకుండానే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ మొదటిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 21 ఏళ్లు రాకుండా 54.0% మంది యువతులకు మూడుముళ్లు పడుతుండగా, జార్ఖండ్‌లో ఇది 54.6% గా ఉంది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు 29.5% మాత్రమే. జార్ఖండ్‌ మరో అపప్రథ కూడా మూటగట్టుకుంది. మంత్రాల నెపంతో ఇక్కడ 2015లో 32 హత్యలు చోటుచేసుకోగా  2018లో 18 మంది, 2019, 2020ల్లో 15 మంది చొప్పున హత్యకు గురయినట్లు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది. 

Also read: Quiz of The Day (October 08, 2022): తెహ్రీడ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?

Published date : 10 Oct 2022 06:13PM

Photo Stories