జనవరి 2017 జాతీయం
Sakshi Education
తెలుగులో భీమ్ యాప్
డిజిటల్ చెల్లింపుల కోసం కేంద్రం రూపొందించిన భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ-BHIM యాప్ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ -NPCI జనవరి 25న తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషల్లో యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ను డిసెంబర్ 30న ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల చేశారు.
గణతంత్ర మార్చ్‌లో తొలిసారి పాల్గొన్న ఎన్‌ఎస్‌జీ
ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో భారత 68వ గణతంత్ర దినోత్సవాలు జనవరి 26న ఘనంగా జరిగాయి. అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతుకు 149 మంది సభ్యులతో కూడిన యూఏఈ సైనికుల బృందం సారథ్యం వహించింది.
2017 గణతంత్ర వేడుకల ప్రత్యేకతలు
మంచు చరియలు విరిగిపడి 20మంది మృతి
జమ్మూ కశ్మీర్‌లో మంచు చరియలు విరిగిపడి 20 మంది మృతి చెందారు. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. జనవరి 23 నుంచి కురుస్తున్న హిమపాతం కారణంగా కశ్మీర్‌లో సాధారణ ప్రజలు, సైనికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు
కొత్త పాస్‌పోర్టులను ఇకపై పోస్టాఫీసుల ద్వారా జారీ చేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు పెలైట్ ప్రాజెక్టు కింద మైసూరులోని పోస్టాఫీసులను ఎంపిక చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్‌పోర్టు కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 50 వేల చొప్పున ఏడాదికి 1.30 కోట్ల పాస్‌పోర్టులు జారీ అవుతున్నాయి.
దివ్యాంగుల చట్టపరిధిలోకి మరో 14 వ్యాధులు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 పరిధిలోకి మరో 14 వ్యాధులు చేరాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 7 కేటగిరీలతో కలిపి మొత్తం 21 రకాల వ్యాధులు/వైకల్యాలు ఉన్న వారిని దివ్యాంగులుగానే పరిగణిస్తారు. ఈ బిల్లు 2016 డిసెంబర్ 14, 16 తేదీలలో రాజ్యసభ, లోక్‌సభల ఆమోదం పొందగా డిసెంబర్ 28 నుంచి అమల్లోకొచ్చింది. ఈ చట్టం ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, ఉన్నత విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ లభిస్తుంది.
కొత్తగా చేర్చిన వ్యాధులు/వైకల్యాలు
చట్ట పరిధిలోని మొత్తంవైకల్యాలు/వ్యాధులు
1. Blindness
2. Low-vision
3. Leprosy Cured persons
4. Hearing Impairment (deaf and hard of hearing)
5. Locomotor Disability
6. Dwarfism
7. Intellectual Disability
8. Mental Illness
9. Autism Spectrum Disorder
10. Cerebral Palsy
11. Muscular Dystrophy
12. Chronic Neurological conditions
13. Specific Learning Disabilities
14. Multiple Sclerosis
15. Speech and Language disability
16. Thalassemia
17. Hemophilia
18. Sickle Cell disease
19. Multiple Disabilities including deafblindness
20. Acid Attack victim
21. Parkinson's disease
మనీ లాండరింగ్ కేసులో తొలి శిక్ష
మనీలాండరింగ్ కేసులో దేశంలోనే తొలిసారిగా దోషికి శిక్షపడింది. ఝార్ఖండ్ మాజీ మంత్రి హరినారాయణ్ రాయ్‌కి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ రాంచీ ప్రత్యేక న్యాయస్థానం జనవరి 29న తీర్పునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం 2005 జూలై 1న అమల్లోకి వచ్చింది.
తమిళనాడులో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం
ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పూర్తయింది. దాదాపు 8500 మంది ఆరు నెలలపాటు పనిచేసి నిర్ణీత గడువు కంటే ముందుగానే దీన్ని పూర్తి చేశారు. 10 చ.కి.మీ విస్తీర్ణంలో అదాని గ్రూప్ 648 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకే ప్రదేశంలో నిర్మితమైన ఈ విద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది కావడం విశేషం. లక్షా యాభై వేల గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని ఆ కంపెనీ జనవరి 26న పేర్కొంది.
గణతంత్ర దినోత్సవ కవాతు
గణతంత్ర దినోత్సవ కవాతులో ఉత్తమ స్థానాలు పొందిన బృందాల పేర్లను సైనిక అధికారులు జనవరి 29 ప్రకటించారు.
సైన్యం: మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ (ప్రథమ స్థానం)
పారామిలిటరీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం-సీఐఎస్‌ఎఫ్ (ప్రథమ స్థానం)
రాష్ట్ర శకటాలు: అరుణాచల్ ప్రదేశ్ (జడల బర్రెల నాట్యం) ప్రథమ స్థానం. త్రిపుర (రియాంగ్ గిరిజనుల హొజగిరి నృత్యం) ద్వితీయ స్థానం.
కేంద్ర శాఖల శకటాలు: ప్రథమ స్థానం... కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శాఖ (విజయాలు), ద్వితీయ స్థానం.. కేంద్ర ప్రజా పనుల శాఖ (పచ్చదనం- పరిశుభ్రత)
అవినీతి సూచీలో భారత్‌కు79వ స్థానం
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2016కు జనవరి 25న విడుదల చేసిన అవినీతి దృక్పథ సూచీలో భారత్ 79వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్, డెన్మార్క్ ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలవగా, సోమాలియా అట్టడుగు స్థానంలో ఉంది. బెర్లిన్‌కు చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్.. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక వేదిక వంటి సంస్థల డేటాను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించింది. ఇందులో భాగంగా మొత్తం 176 దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని పరిశీలించింది.
హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా ధర్మశాల
ధర్మశాలను హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా సీఎం వీరభద్రసింగ్ జనవరి 19న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, రెండో రాజధానిగా ధర్మశాల సముచితంగా ఉంటుందన్నారు. 2005లో తొలిసారి ధర్మశాలలో పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ 12సార్లు శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది.
జల్లికట్టుపై ఆర్డినెన్స్
నిషేధిత జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. జల్లికట్టు కోసం నిరసనలు, బంద్‌లతో తమిళనాడు మొత్తం స్తంభించడంతో తమిళనాడు పంపిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు స్వల్ప మార్పులతో కేంద్రం ఆమోదం తెలిపింది. జంతువులకు (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితరాలు) శిక్షణ ఇచ్చి ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది.
జల్లికట్టు బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం: తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై.. జల్లికట్టు బిల్లును జనవరి 23న ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి.
సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన జోధ్‌పూర్ న్యాయస్థానం
18 ఏళ్ల నాటి అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జోధ్‌పూర్ న్యాయస్థానం జనవరి 18న తీర్పు వెలువరించింది. 1998 అక్టోబర్‌లో రాజస్తాన్‌లోని కంకానీలో సల్మాన్ రెండు కృష్ణజింకలను వేటాడాడని, ఇందుకోసం లెసైన్‌స గడువు ముగిసిన ఆయుధాలను కలిగి ఉండటమే కాక వాటిని వినియోగించాడన్నది అభియోగం. సల్మాన్‌పై ఉన్న 4 కేసుల్లో అక్రమాయుధాల కేసు ఒకటి.
విరాళాల సేకరణలో శివసేన ‘టాప్’
2015-16 ఏడాదికి అత్యధిక మొత్తం విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీగా శివసేన నిలిచింది. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌ల సంయుక్త నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల మొత్తం రూ.107.62 కోట్లు కాగా శివసేనకు రూ.86.8 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 6.6 కోట్లు వచ్చాయి.
105 చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం
ఎలాంటి ఉపయోగం లేకుండా కేవలం కాగితాలేకే పరిమితమైన 105 చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ జనవరి 18న ఆమోదం తెలిపింది. ఇందుకోసం ‘రద్దు-సవరణ బిల్లు-2017’ ను తీసుకురానుంది. వీటిలో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన చట్టాలున్నాయి. ఈ మేరకు ఇద్దరు సభ్యుల కమిటీ 1824 చట్టాలు ప్రస్తుత అవసరాలకు పనికిరావని తేల్చింది. మరో 139 చట్టాల రద్దును వివిధ మంత్రిత్వ శాఖలు వ్యతిరేకించాయి.
హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 40 మంది మృతి
విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జనవరి 20 అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 40 మంది చనిపోయారు. 71 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కూనేరు వద్ద పట్టాలు తప్పటంతో ఈ ప్రమాదం జరిగింది.
గతంలో జరిగిన రైలు ప్రమాదాలు
రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఆమోదం
రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసేందుకు చేసిన సవరణను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 20న ఆమోదించారు. రైల్వే పద్దును సాధారణ బడ్జెట్‌లో కలిపేందుకు 2016 సెప్టెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ (వాణిజ్య కేటాయింపులు) నిబంధనలు-1961 చట్టంలో సవరణలు చేశారు.
వివాహ రద్దు అధికారం చర్చిలకు లేదు : సుప్రీంకోర్టు
క్రిస్టియన్ పర్సనల్ లా ప్రకారం చర్చి కోర్టులు క్రైస్తవ జంటలకు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలా విడాకులు మంజూరు చేయడం భారత చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానిస్తూ జనవరి 19న కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా చర్చి కోర్టులు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. చర్చి కోర్టులు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు 1996లోనే తీర్పు చెప్పింది.
నలుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష
మరణశిక్ష పడిన నలుగురు ఖైదీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు జనవరి 21న వారి శిక్షలను యావజ్జీవ ఖైదుగా మారుస్తూ సంతకం చేశారు. 1992లో బిహార్‌లో అగ్రవర్ణాలకు చెందిన 34 మందిని హత్య చేసిన కేసులో కృష్ణ మోచీ, నన్హే లాల్ మోచీ, బిర్‌క్యూర్ పాశ్వాన్, ధర్మేంద్ర సింగ్ అలియాస్ దారూసింగ్‌లకు 2001లో సెషన్‌స కోర్టు మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. వీరి తరఫున బిహార్ ప్రభుత్వం దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కేంద్రం తిరస్కరించి దోషులపై దయచూపొద్దంటూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.
బిహార్‌లో మహా మానవహారం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవాహారాన్ని బిహార్ రాజధాని పట్నాలో జనవరి 20న ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో 2016 ఏప్రిల్ నుంచి అమలవుతోన్న సంపూర్ణ మద్యపాన నిషేధానికి మద్దతుగా మూడు కోట్ల మంది 11 వేల 400 కిలోమీటర్ల హారాన్ని నిర్మించారు. ఇస్రో సాయంతో ఉపగ్రహా చిత్రాలు తీశారు. గతంలో అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కి.మీతో బంగ్లాదేశ్ పేరిట ఉండేది.
జాతీయ గీతాలాపనలో కొదియార్ భక్తుల రికార్డు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కగ్‌వాడ్‌లో జనవరి 20న ఒకేసారి 3.5 లక్షల మంది జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. తమ ఆరాధ్య దేవత కొదియార్‌కు నూతన ఆలయాన్ని నిర్మించిన లువ్యా పటేల్ సామాజిక వర్గ ప్రజలు విగ్రహావిష్కరణ సందర్భంగా జనగణమన ఆలపించారు. 40 కి.మీ మేర శోభాయాత్ర నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోనూ చోటు దక్కించుకున్నారు.
రంజిత్ సిన్హాపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
బొగ్గు కుంభకోణం కేసులో అధికార దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్ సిన్హాపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ మాజీ ప్రత్యేక డెరైక్టర్ ఎంఎల్ శర్మ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది.
50 వేలకు మించిన లావాదేవీలపై పన్ను
రూ.50 వేలకు పైబడిన నగదు లావాదేవీలపై పన్ను విధించాలని నగదు రహిత లావాదేవీల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ జనవరి 24న ప్రధాని మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. నగదు ఉపసంహరణపై ఒక గరిష్ట పరిమితి నిర్దేశించాలని సూచించిన కమిటీ ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై ఛార్జీలు ఉండకూడదని, వాటికి రాయితీలతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొంది.
నివేదికలోని కీలక సిఫార్సులు
ఒక శాతం సంపన్నుల చేతుల్లో 58 శాతం సంపద
దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా ఆక్స్‌ఫామ్ అనే సంస్థ ‘యాన్ ఎకానమీ ఫర్ 99 పర్సెంట్’ పేరుతో జనవరి 16న ఈ నివేదిక విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు
బెంగళూరులో 14వ ప్రవాసి భారతీయ దినోత్సవం
14వ ప్రవాసి భారతీయ దివస్ బెంగుళూరులో జనవరి 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సంతతికి చెందిన సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మైఖేల్ ఆశ్విన్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 8న హాజరై ప్రసంగించారు. మహాత్మా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చిన రోజును 2003 నుంచి ప్రవాసీ దివస్‌గా జరుపుకుంటున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 4న షెడ్యూలు ప్రకటించింది. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో జరుగుతాయి.
రాష్ట్రాల వారీగా ఎన్నికల తేదీలు
రోడ్డు ప్రమాదాల మరణాల్లో ఉత్తరప్రదేశ్ టాప్
రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 18,047 మంది మరణిస్తున్నట్లు నేషనల్ ్రైకైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2014లో దేశవ్యాప్తంగా 4,50,000 రోడ్డు ప్రమాదాలు జరగగా 2015లో 4,64,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా తమిళనాడులో 69,059 ప్రమాదాలు జరగగా తర్వాతి స్థానాల్లో కర్ణాటక (44,011), మహారాష్ట్ర (42,250) ఉన్నాయి. 2011లో రోడ్డు ప్రమాదాల్లో 1,36,000 మంది మరణించగా 2015 నాటికి 9 శాతం (1,48,000) మరణాలు పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ రోడ్డు ప్రమాదాలు, ఆత్మ హత్యలపై విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. రోడ్డు రవాణా వల్ల దేశ జీడీపీకి 4.8 శాతం ఆదాయం లభిస్తుండగా రోడ్డు ప్రమాదాల వల్ల 1-3 శాతం నష్టం చేకూరుతోందని ప్రణాళిక సంఘం వెల్లడించింది.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వేటు
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పీపీఏ) వేటు వేసింది. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో 60 స్థానాలున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండుతో పాటు 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరండంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 60 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం పీపీఏ కు 43, బీజేపీకి 11 మంది సభ్యులున్నారు. తాజా నేపథ్యంలో బీజేపీ సభ్యులు 44 కు చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో అరుణాచల్ బీజేపీ పాలిత పదవ రాష్ట్రంగా నిలిచింది.
ఈశాన్య ప్రజాతంత్ర కూటమి(ఎన్‌ఈడీఏ) సంకీర్ణ ప్రభుత్వంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ భాగస్వామి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నెపంతో పెమా ఖండుతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలను డిసెంబర్ 31న పీపీఏ బహిష్కరించింది. దీంతో తనకు మద్దతుగా నిలిచిన 33 మందితో సహా ఖండూ బీజేపీలో చేరారు. ఖండూ 2016 సెప్టెంబర్‌లో కూడా 42 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
తిరువనంతపురంలో 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్
77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరువనంతపురంలో డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్ర పరిశీలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.
మార్చి 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉంటే నేరం
2017, మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదం తెలిపింది. పాత నోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5 వేల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. రద్దయిన నోట్లు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్నా లేదా స్వీకరించినానేరంగా పరిగణిస్తారు.
20 వేల స్వచ్ఛంద సంస్థల లెసైన్సులు రద్దు
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 27న దేశంలోని 20 వేల స్వచ్ఛంద సంస్థల లెసైన్సులను రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విదేశీయుల విభాగంపై నిర్వహించిన సమీక్షలో దేశంలో ఉన్న మొత్తం 33 వేల స్వచ్ఛంద సంస్థల్లో 20 వేల సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించినట్లు పేర్కొన్నారు.
న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సు
భారత న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ డిసెంబర్ 27న బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంపదలో 45 శాతాన్ని కోటీశ్వరులే నియంత్రిస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలున్న దేశాల్లో భారత్ పన్నెండో స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సామాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా, నరేశ్ ఉత్తమ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ సమావేశం జనవరి 1న నిర్ణయించింది. ఈ సమావేశంలో ములాయం సింగ్ యాదవ్‌ను జాతీయాధ్యక్షుడిగా, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతోపాటు సీనియర్ నేత అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.
కులమతాల పేరుతో ఓట్లు కోరడం అవినీతే: సుప్రీంకోర్టు
ఎన్నికల ప్రచారంలో మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్యేనని సుప్రీం కోర్టు జనవరి 2న స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హిందుత్వం జీవన విధానమన్న తన 21 ఏళ్ల నాటి వివాదాస్పద తీర్పును సవరించింది. ‘‘ప్రజాప్రాతినిధ్య (ఆర్‌పీ) చట్టం-1951లోని 123(3) సెక్షన్ ప్రకారం ‘అతని మతం’(హిజ్ రిలిజియన్) అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి కులమతాలూ అని అర్థం‘ అని జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు(మెజారిటీ జడ్జీలు) స్పష్టం చేశారు. వీరితో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విబేధించారు.
కులమతాల పేర్లతో ఓట్లు అడగడం అవినీతా, కాదా అన్న దానికి సంబంధించిన ఎన్నికల చట్ట నిబంధన విసృ్తతిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

- బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే జాతీయ భద్రతా దళం-NSG గణతంత్ర కవాతులో తొలిసారి పాల్గొంది.
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను తొలిసారి గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు.
- భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశం యూఏఈ. 2016లో ఫ్రాన్స్ దళాలు తొలిసారి వేడుకల్లో పాల్గొన్నాయి.
మంచు చరియలు విరిగిపడి 20మంది మృతి
జమ్మూ కశ్మీర్‌లో మంచు చరియలు విరిగిపడి 20 మంది మృతి చెందారు. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. జనవరి 23 నుంచి కురుస్తున్న హిమపాతం కారణంగా కశ్మీర్‌లో సాధారణ ప్రజలు, సైనికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు
కొత్త పాస్‌పోర్టులను ఇకపై పోస్టాఫీసుల ద్వారా జారీ చేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు పెలైట్ ప్రాజెక్టు కింద మైసూరులోని పోస్టాఫీసులను ఎంపిక చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్‌పోర్టు కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 50 వేల చొప్పున ఏడాదికి 1.30 కోట్ల పాస్‌పోర్టులు జారీ అవుతున్నాయి.
దివ్యాంగుల చట్టపరిధిలోకి మరో 14 వ్యాధులు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 పరిధిలోకి మరో 14 వ్యాధులు చేరాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 7 కేటగిరీలతో కలిపి మొత్తం 21 రకాల వ్యాధులు/వైకల్యాలు ఉన్న వారిని దివ్యాంగులుగానే పరిగణిస్తారు. ఈ బిల్లు 2016 డిసెంబర్ 14, 16 తేదీలలో రాజ్యసభ, లోక్‌సభల ఆమోదం పొందగా డిసెంబర్ 28 నుంచి అమల్లోకొచ్చింది. ఈ చట్టం ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, ఉన్నత విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ లభిస్తుంది.
కొత్తగా చేర్చిన వ్యాధులు/వైకల్యాలు
మరుగుజ్జులు | ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ |
సెరెబ్రల్ పాల్సీ | మస్కులర్ డిస్ట్రోప్రీ |
క్రానిక్ న్యూరోలాజికల్ కండిషన్ | స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీస్ |
మల్టిపుల్ సెలెరోసిస్ | స్పీచ్ అండ్ ల్యాంగ్వేజ్ డిసేబిలిటీ |
తలసీమియా | హిమోఫిలియా |
సికిల్ సెల్ డిసీజెస్ | యాసిడ్ దాడుల బాధితులు |
చెవుడు | పార్కిన్‌సన్స్ |
చట్ట పరిధిలోని మొత్తంవైకల్యాలు/వ్యాధులు
1. Blindness
2. Low-vision
3. Leprosy Cured persons
4. Hearing Impairment (deaf and hard of hearing)
5. Locomotor Disability
6. Dwarfism
7. Intellectual Disability
8. Mental Illness
9. Autism Spectrum Disorder
10. Cerebral Palsy
11. Muscular Dystrophy
12. Chronic Neurological conditions
13. Specific Learning Disabilities
14. Multiple Sclerosis
15. Speech and Language disability
16. Thalassemia
17. Hemophilia
18. Sickle Cell disease
19. Multiple Disabilities including deafblindness
20. Acid Attack victim
21. Parkinson's disease
మనీ లాండరింగ్ కేసులో తొలి శిక్ష
మనీలాండరింగ్ కేసులో దేశంలోనే తొలిసారిగా దోషికి శిక్షపడింది. ఝార్ఖండ్ మాజీ మంత్రి హరినారాయణ్ రాయ్‌కి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ రాంచీ ప్రత్యేక న్యాయస్థానం జనవరి 29న తీర్పునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం 2005 జూలై 1న అమల్లోకి వచ్చింది.
తమిళనాడులో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం
ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పూర్తయింది. దాదాపు 8500 మంది ఆరు నెలలపాటు పనిచేసి నిర్ణీత గడువు కంటే ముందుగానే దీన్ని పూర్తి చేశారు. 10 చ.కి.మీ విస్తీర్ణంలో అదాని గ్రూప్ 648 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒకే ప్రదేశంలో నిర్మితమైన ఈ విద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది కావడం విశేషం. లక్షా యాభై వేల గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని ఆ కంపెనీ జనవరి 26న పేర్కొంది.
గణతంత్ర దినోత్సవ కవాతు
గణతంత్ర దినోత్సవ కవాతులో ఉత్తమ స్థానాలు పొందిన బృందాల పేర్లను సైనిక అధికారులు జనవరి 29 ప్రకటించారు.
సైన్యం: మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ (ప్రథమ స్థానం)
పారామిలిటరీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం-సీఐఎస్‌ఎఫ్ (ప్రథమ స్థానం)
రాష్ట్ర శకటాలు: అరుణాచల్ ప్రదేశ్ (జడల బర్రెల నాట్యం) ప్రథమ స్థానం. త్రిపుర (రియాంగ్ గిరిజనుల హొజగిరి నృత్యం) ద్వితీయ స్థానం.
కేంద్ర శాఖల శకటాలు: ప్రథమ స్థానం... కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శాఖ (విజయాలు), ద్వితీయ స్థానం.. కేంద్ర ప్రజా పనుల శాఖ (పచ్చదనం- పరిశుభ్రత)
అవినీతి సూచీలో భారత్‌కు79వ స్థానం
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2016కు జనవరి 25న విడుదల చేసిన అవినీతి దృక్పథ సూచీలో భారత్ 79వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్, డెన్మార్క్ ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలవగా, సోమాలియా అట్టడుగు స్థానంలో ఉంది. బెర్లిన్‌కు చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్.. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక వేదిక వంటి సంస్థల డేటాను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించింది. ఇందులో భాగంగా మొత్తం 176 దేశాల్లో ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని పరిశీలించింది.
హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా ధర్మశాల
ధర్మశాలను హిమాచల్‌ప్రదేశ్ రెండో రాజధానిగా సీఎం వీరభద్రసింగ్ జనవరి 19న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, రెండో రాజధానిగా ధర్మశాల సముచితంగా ఉంటుందన్నారు. 2005లో తొలిసారి ధర్మశాలలో పూర్తిస్థాయి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ 12సార్లు శీతాకాల సమావేశాలు జరిగాయి. ధర్మశాలలో పూర్తిస్థాయి శాసనసభ భవనం కూడా అందుబాటులో ఉంది.
జల్లికట్టుపై ఆర్డినెన్స్
నిషేధిత జల్లికట్టు నిర్వహణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. జల్లికట్టు కోసం నిరసనలు, బంద్‌లతో తమిళనాడు మొత్తం స్తంభించడంతో తమిళనాడు పంపిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు స్వల్ప మార్పులతో కేంద్రం ఆమోదం తెలిపింది. జంతువులకు (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితరాలు) శిక్షణ ఇచ్చి ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది.
జల్లికట్టు బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం: తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై.. జల్లికట్టు బిల్లును జనవరి 23న ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి.
సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన జోధ్‌పూర్ న్యాయస్థానం
18 ఏళ్ల నాటి అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జోధ్‌పూర్ న్యాయస్థానం జనవరి 18న తీర్పు వెలువరించింది. 1998 అక్టోబర్‌లో రాజస్తాన్‌లోని కంకానీలో సల్మాన్ రెండు కృష్ణజింకలను వేటాడాడని, ఇందుకోసం లెసైన్‌స గడువు ముగిసిన ఆయుధాలను కలిగి ఉండటమే కాక వాటిని వినియోగించాడన్నది అభియోగం. సల్మాన్‌పై ఉన్న 4 కేసుల్లో అక్రమాయుధాల కేసు ఒకటి.
విరాళాల సేకరణలో శివసేన ‘టాప్’
2015-16 ఏడాదికి అత్యధిక మొత్తం విరాళాలను సేకరించిన ప్రాంతీయ పార్టీగా శివసేన నిలిచింది. ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌ల సంయుక్త నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. నివేదిక ప్రకారం ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల మొత్తం రూ.107.62 కోట్లు కాగా శివసేనకు రూ.86.8 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 6.6 కోట్లు వచ్చాయి.
105 చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం
ఎలాంటి ఉపయోగం లేకుండా కేవలం కాగితాలేకే పరిమితమైన 105 చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ జనవరి 18న ఆమోదం తెలిపింది. ఇందుకోసం ‘రద్దు-సవరణ బిల్లు-2017’ ను తీసుకురానుంది. వీటిలో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన చట్టాలున్నాయి. ఈ మేరకు ఇద్దరు సభ్యుల కమిటీ 1824 చట్టాలు ప్రస్తుత అవసరాలకు పనికిరావని తేల్చింది. మరో 139 చట్టాల రద్దును వివిధ మంత్రిత్వ శాఖలు వ్యతిరేకించాయి.
హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 40 మంది మృతి
విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జనవరి 20 అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 40 మంది చనిపోయారు. 71 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కూనేరు వద్ద పట్టాలు తప్పటంతో ఈ ప్రమాదం జరిగింది.
గతంలో జరిగిన రైలు ప్రమాదాలు
- 1981 జూన్ 6 : బిహార్‌లోని సహర్సా వద్ద ప్యాసింజర్ రైలు భాగమతి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 800 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
- 1995 ఆగస్టు 20 : ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద పురుషోత్తం ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 358 మంది చనిపోయారు.
- 1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసాల్ వద్ద అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ ఢీకొనండంతో 268 మంది మృతిచెందారు.
- 1998 నవంబరు 26: పంజాబ్‌లోని ఖాన్నా వద్ద జమ్మూ తావీ-సీల్డా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురవడంతో 212 మంది మరణించారు.
- 2010 మే 28 : పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో లోకమాన్య తిలక్ జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 170 మంది మరణించారు.
రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఆమోదం
రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసేందుకు చేసిన సవరణను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 20న ఆమోదించారు. రైల్వే పద్దును సాధారణ బడ్జెట్‌లో కలిపేందుకు 2016 సెప్టెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ (వాణిజ్య కేటాయింపులు) నిబంధనలు-1961 చట్టంలో సవరణలు చేశారు.
వివాహ రద్దు అధికారం చర్చిలకు లేదు : సుప్రీంకోర్టు
క్రిస్టియన్ పర్సనల్ లా ప్రకారం చర్చి కోర్టులు క్రైస్తవ జంటలకు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలా విడాకులు మంజూరు చేయడం భారత చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానిస్తూ జనవరి 19న కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా చర్చి కోర్టులు ఇచ్చే విడాకులకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. చర్చి కోర్టులు మంజూరు చేసే విడాకులకు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు 1996లోనే తీర్పు చెప్పింది.
నలుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష
మరణశిక్ష పడిన నలుగురు ఖైదీలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పెట్టారు. ఈ మేరకు జనవరి 21న వారి శిక్షలను యావజ్జీవ ఖైదుగా మారుస్తూ సంతకం చేశారు. 1992లో బిహార్‌లో అగ్రవర్ణాలకు చెందిన 34 మందిని హత్య చేసిన కేసులో కృష్ణ మోచీ, నన్హే లాల్ మోచీ, బిర్‌క్యూర్ పాశ్వాన్, ధర్మేంద్ర సింగ్ అలియాస్ దారూసింగ్‌లకు 2001లో సెషన్‌స కోర్టు మరణశిక్ష విధించింది. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. వీరి తరఫున బిహార్ ప్రభుత్వం దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కేంద్రం తిరస్కరించి దోషులపై దయచూపొద్దంటూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.
బిహార్‌లో మహా మానవహారం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవాహారాన్ని బిహార్ రాజధాని పట్నాలో జనవరి 20న ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో 2016 ఏప్రిల్ నుంచి అమలవుతోన్న సంపూర్ణ మద్యపాన నిషేధానికి మద్దతుగా మూడు కోట్ల మంది 11 వేల 400 కిలోమీటర్ల హారాన్ని నిర్మించారు. ఇస్రో సాయంతో ఉపగ్రహా చిత్రాలు తీశారు. గతంలో అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కి.మీతో బంగ్లాదేశ్ పేరిట ఉండేది.
జాతీయ గీతాలాపనలో కొదియార్ భక్తుల రికార్డు
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కగ్‌వాడ్‌లో జనవరి 20న ఒకేసారి 3.5 లక్షల మంది జాతీయ గీతాన్ని ఆలపించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. తమ ఆరాధ్య దేవత కొదియార్‌కు నూతన ఆలయాన్ని నిర్మించిన లువ్యా పటేల్ సామాజిక వర్గ ప్రజలు విగ్రహావిష్కరణ సందర్భంగా జనగణమన ఆలపించారు. 40 కి.మీ మేర శోభాయాత్ర నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులోనూ చోటు దక్కించుకున్నారు.
రంజిత్ సిన్హాపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
బొగ్గు కుంభకోణం కేసులో అధికార దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్ సిన్హాపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ మాజీ ప్రత్యేక డెరైక్టర్ ఎంఎల్ శర్మ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది.
50 వేలకు మించిన లావాదేవీలపై పన్ను
రూ.50 వేలకు పైబడిన నగదు లావాదేవీలపై పన్ను విధించాలని నగదు రహిత లావాదేవీల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ జనవరి 24న ప్రధాని మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. నగదు ఉపసంహరణపై ఒక గరిష్ట పరిమితి నిర్దేశించాలని సూచించిన కమిటీ ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై ఛార్జీలు ఉండకూడదని, వాటికి రాయితీలతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని పేర్కొంది.
నివేదికలోని కీలక సిఫార్సులు
- నగదు వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా రూ. 50 వేలు, ఆ పైబడిన నగదు లావాదేవీలపై బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ టాక్స్ (BCTT)ను అమలు చేయాలి.
- నగదు రహిత లావాదేవీలు జరిపే వర్తకులకు ఎలాంటి చార్జీలు, పన్నులు వేయొద్దు.
- మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్ సెన్సర్లకు పన్ను రాయితీలు వర్తింపజేయాలి.
- నగదు రహిత లావాదేవీలను అమలు చేసేవారికి పన్ను తిరిగి చెల్లించాలి.
- ఆధార్ చెల్లింపులకు వీలుగా బయోమెట్రిక్ పరికరాలపై 50 శాతం రాయితీ ఇవ్వాలి.
- ఆధార్ ఆధారిత చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్-MDR విధించొద్దు.
- ఆదాయ పన్ను పరిధిలోకి రాని పౌరులు, చిన్నవ్యాపారుల స్మార్టు ఫోన్ కొనుగోలుకు రూ.1000 రాయితీ ఇవ్వాలి.
- 1,54,000 పోస్టాఫీసుల్లో ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంలు సమకూర్చాలి.
- గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకులు తక్షణం నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలి.
- ప్రభుత్వరంగ సంస్థల పరిధిలోని లావాదేవీలన్నిటినీ నగదు రహితంగా మార్చాలి.
భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2015-16
దేశవ్యాప్తంగా హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 2016 జూన్ 30 వరకు ఉన్న పెండింగ్ కేసులు, న్యాయమూర్తుల ఖాళీలపై సుప్రీంకోర్టు వార్షిక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 24 హైకోర్టుల్లో 40.54 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 44 శాతం న్యాయమూర్తుల కొరత ఉంది. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో దాదాపు 2.8 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 5 వేల జడ్జీ పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కోర్టుల్లో సిబ్బందిని కనీసం ఏడు రెట్లు పెంచాలని, రాబోయే మూడేళ్లలో దాదాపు 15 వేల మందికి పైగా జడ్జీల్ని నియమించాలని ఈ నివేదిక పేర్కొంది.
నివేదిక ముఖ్యాంశాలు:
- మొత్తం 24 హైకోర్టులకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 1,079 కాగా, కేవలం 608 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య కంటే ఇది 43.65 శాతం తక్కువ.
- హైకోర్టుల్లోని మొత్తం 40.54 లక్షల అపరిష్కృత కేసుల్లో సివిల్ కేసుల సంఖ్య 29,31,352 కాగా, క్రిమినల్ కేసులు 11,23,178. మొత్తం కేసుల్లో పదేళ్లకు పూర్వం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు 7,43,191.
- జిల్లా కోర్టుల్లో దేశవ్యాప్తంగా 2,81,25,066 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1,89,04,222 కేసుల్ని కిందిస్థాయి కోర్టులు పరిష్కరించాయి.
- జిల్లా కోర్టుల్లో 4,954 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండగా, అనుమతించిన న్యాయాధికారుల సంఖ్య 21,324 మందిగా నివేదిక పేర్కొంది.
- అపరిష్కృత కేసులు, న్యాయమూర్తుల ఖాళీల్లో అలహాబాద్ హైకోర్టు ముందంజలో ఉంది. మొత్తం 9.24 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా 3 లక్షలకు పైగా కేసులు 10 ఏళ్లకు కిందటివి. అలహాబాద్ హైకోర్టులో మొత్తం 160 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా 78 మందే ఉన్నారు.
- అలహాబాద్ తర్వాత మద్రాసు హైకోర్టులో అపరిష్కృత కేసులు 3,02,846 కాగా, 75 మంది న్యాయమూర్తులకుగాను 38 మందే ఉన్నారు.
- బాంబే హైకోర్టులో 2,98,263 కేసులు అపరిష్కృతంగా ఉండగా, అందులో 53,511 కేసులు పదేళ్లకు పూర్వం నాటివి. ఈ కోర్టుకు 94 మంది న్యాయమూర్తుల్ని కేటాయించగా 64 మందే ఉన్నారు.
- ఏపీ, తెలంగాణలో ఉమ్మడి హైకోర్టులో 2,78,695 కేసులు అపరిష్కృతంగా ఉండగా ఇందులో 24,606 కేసులు పదేళ్లనాటివి. 61 న్యాయమూర్తులు అవసరం కాగా ప్రస్తుతం 25 మంది ఉన్నారు.
- దేశంలో చత్తీస్‌గఢ్ హైకోర్టులో అత్యంత తక్కువగా 37 శాతం మాత్రమే న్యాయమూర్తులున్నారు. ఈ హైకోర్టుకు 22 మంది అవసరం కాగా ప్రస్తుతం 8 మందే పనిచేస్తున్నారు. ఇక పెండింగ్ కేసులు మాత్రం 54 వేలకు పైనే ఉన్నాయి.
ఒక శాతం సంపన్నుల చేతుల్లో 58 శాతం సంపద
దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సందర్భంగా ఆక్స్‌ఫామ్ అనే సంస్థ ‘యాన్ ఎకానమీ ఫర్ 99 పర్సెంట్’ పేరుతో జనవరి 16న ఈ నివేదిక విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు
- దేశంలో మొత్తం సంపద 3.1 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో 70 శాతం మంది సంపద 216 బిలియన్ డాలర్లు. ఇది 57 మంది బిలియనీర్ల సంపదకు సమానం.
- దేశంలోని 84 మంది బిలియనీర్ల సమష్టి సంపద 248 బిలియన్ డాలర్లు. వీరిలో తొలి మూడు స్థానాల్లో ఉన్నవారు... 1.ముకేశ్ అంబానీ (19.3 బిలియన్ డాలర్లు) 2. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్‌సంఘ్వి (16.7బిలియన్ డాలర్లు) 3. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ (15 బిలియన్ డాలర్లు).
- ప్రపంచ మొత్తం సంపద 255.7 ట్రిలియన్ డాలర్లు. ఇందులో 6.5 ట్రిలియన్ డాలర్లు కేవలం 8 మంది బిలియనీర్లు కలిగి ఉన్నారు. 1. బిల్‌గేట్స్ (75 బిలియన్ డాలర్లు) 2. అమన్సియో ఒర్టెగా (67 బిలియన్ డాలర్లు) 3. వారెన్ బఫెట్ (60.8 బిలియన్ డాలర్లు).
- 2015 నుంచి ఒక్క శాతం మంది సంపన్నులు ప్రపంచ జనాభాకు మించిన సంపదను కలిగి ఉన్నారు.
బెంగళూరులో 14వ ప్రవాసి భారతీయ దినోత్సవం
14వ ప్రవాసి భారతీయ దివస్ బెంగుళూరులో జనవరి 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సంతతికి చెందిన సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మైఖేల్ ఆశ్విన్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 8న హాజరై ప్రసంగించారు. మహాత్మా గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చిన రోజును 2003 నుంచి ప్రవాసీ దివస్‌గా జరుపుకుంటున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 4న షెడ్యూలు ప్రకటించింది. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో జరుగుతాయి.
రాష్ట్రాల వారీగా ఎన్నికల తేదీలు
ఉత్తరప్రదేశ్ | ఫిబ్రవరి 11, 15, 19, 23, 3, 8 |
పంజాబ్ | ఫిబ్రవరి 4 |
గోవా | ఫిబ్రవరి 4 |
ఉత్తరాఖండ్ | ఫిబ్రవరి 15 |
మణిపూర్ | మార్చి 4, 8 |
రోడ్డు ప్రమాదాల మరణాల్లో ఉత్తరప్రదేశ్ టాప్
రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 18,047 మంది మరణిస్తున్నట్లు నేషనల్ ్రైకైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2014లో దేశవ్యాప్తంగా 4,50,000 రోడ్డు ప్రమాదాలు జరగగా 2015లో 4,64,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా తమిళనాడులో 69,059 ప్రమాదాలు జరగగా తర్వాతి స్థానాల్లో కర్ణాటక (44,011), మహారాష్ట్ర (42,250) ఉన్నాయి. 2011లో రోడ్డు ప్రమాదాల్లో 1,36,000 మంది మరణించగా 2015 నాటికి 9 శాతం (1,48,000) మరణాలు పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ రోడ్డు ప్రమాదాలు, ఆత్మ హత్యలపై విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. రోడ్డు రవాణా వల్ల దేశ జీడీపీకి 4.8 శాతం ఆదాయం లభిస్తుండగా రోడ్డు ప్రమాదాల వల్ల 1-3 శాతం నష్టం చేకూరుతోందని ప్రణాళిక సంఘం వెల్లడించింది.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వేటు
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ప్రదేశ్(పీపీఏ) వేటు వేసింది. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో 60 స్థానాలున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండుతో పాటు 33 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరండంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 60 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం పీపీఏ కు 43, బీజేపీకి 11 మంది సభ్యులున్నారు. తాజా నేపథ్యంలో బీజేపీ సభ్యులు 44 కు చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో అరుణాచల్ బీజేపీ పాలిత పదవ రాష్ట్రంగా నిలిచింది.
ఈశాన్య ప్రజాతంత్ర కూటమి(ఎన్‌ఈడీఏ) సంకీర్ణ ప్రభుత్వంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ భాగస్వామి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నెపంతో పెమా ఖండుతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలను డిసెంబర్ 31న పీపీఏ బహిష్కరించింది. దీంతో తనకు మద్దతుగా నిలిచిన 33 మందితో సహా ఖండూ బీజేపీలో చేరారు. ఖండూ 2016 సెప్టెంబర్‌లో కూడా 42 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
తిరువనంతపురంలో 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్
77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరువనంతపురంలో డిసెంబర్ 29న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్ర పరిశీలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.
మార్చి 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉంటే నేరం
2017, మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదం తెలిపింది. పాత నోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5 వేల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. రద్దయిన నోట్లు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తం ఉన్నా లేదా స్వీకరించినానేరంగా పరిగణిస్తారు.
20 వేల స్వచ్ఛంద సంస్థల లెసైన్సులు రద్దు
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 27న దేశంలోని 20 వేల స్వచ్ఛంద సంస్థల లెసైన్సులను రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విదేశీయుల విభాగంపై నిర్వహించిన సమీక్షలో దేశంలో ఉన్న మొత్తం 33 వేల స్వచ్ఛంద సంస్థల్లో 20 వేల సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించినట్లు పేర్కొన్నారు.
న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సు
భారత న్యాయవాదుల సంఘం జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ డిసెంబర్ 27న బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంపదలో 45 శాతాన్ని కోటీశ్వరులే నియంత్రిస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలున్న దేశాల్లో భారత్ పన్నెండో స్థానంలో ఉందని న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సామాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా, నరేశ్ ఉత్తమ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ సమావేశం జనవరి 1న నిర్ణయించింది. ఈ సమావేశంలో ములాయం సింగ్ యాదవ్‌ను జాతీయాధ్యక్షుడిగా, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతోపాటు సీనియర్ నేత అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.
కులమతాల పేరుతో ఓట్లు కోరడం అవినీతే: సుప్రీంకోర్టు
ఎన్నికల ప్రచారంలో మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్యేనని సుప్రీం కోర్టు జనవరి 2న స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హిందుత్వం జీవన విధానమన్న తన 21 ఏళ్ల నాటి వివాదాస్పద తీర్పును సవరించింది. ‘‘ప్రజాప్రాతినిధ్య (ఆర్‌పీ) చట్టం-1951లోని 123(3) సెక్షన్ ప్రకారం ‘అతని మతం’(హిజ్ రిలిజియన్) అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి కులమతాలూ అని అర్థం‘ అని జస్టిస్ ఠాకూర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులు(మెజారిటీ జడ్జీలు) స్పష్టం చేశారు. వీరితో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విబేధించారు.
కులమతాల పేర్లతో ఓట్లు అడగడం అవినీతా, కాదా అన్న దానికి సంబంధించిన ఎన్నికల చట్ట నిబంధన విసృ్తతిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
Published date : 09 Jan 2017 04:32PM