Chenab Rail Bridge: చీనాబ్ రైలుమార్గ వంతెనలో సిద్ధమైన గోల్డెన్ జాయింట్
Sakshi Education
ప్రపంచంలో అత్యంత ఎత్తైనదిగా పేర్కొనే జమ్ము కశ్మీర్‌లోని చీనాబ్ వంతెనలో కీలక భాగం సిద్ధమైంది.'గోల్డెన్ జాయింట్'గా పిలిచే ఈ భాగంతో వంతెనలో దాదాపు 98శాతం పనులు పూర్తయినట్లే. చినాబ్‌నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తున ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదన్న విషయం తెలిసిందే. రూ.1,250 కోట్ల ఖర్చుతో దీనిని చేపట్టారు.. కశ్మీర్‌ౖ రెల్వే ప్రాజెక్టులోని ఉదంపుర్ శ్రీనగర్ బారాముల్లా మార్గంలో ఈ వంతెన ఉంది. విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం వంతెన మధ్యలో కలుసుకుంటుంది. బలమైన గాలులతోపాటు, భూకంపాలను తట్టుకునేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 26 Aug 2022 05:15PM