Defence Ministry: ఎఎల్‌హెచ్ మార్క్–3 హెలికాప్టర్లను తయరు చేస్తోన్న సంస్థ?
భారత ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ.13,165 కోట్ల కేటాయింపులకు భారత రక్షణ శాఖ సెప్టెంబర్ 29న ఆమోదముద్ర వేసింది. సైనిక అవసరాలతో పాటు ఆర్మీలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఎఎల్‌హెచ్ మార్క్–3 హెలికాప్టర్లు 25 కొనుగోలు చేయనుంది. హెలికాఫ్టర్ల కోసం రూ. 3,850 కోట్లు, రాకెట్లు, ఇతర ఆయుధాల కోసం రూ.4,962 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. భారత ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) మార్క్–3 హెలికాప్టర్లను తయారు చేస్తోంది. డబుల్ ఇంజిన్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ హెలికాప్టర్లు 5.5 టన్నుల బరువున్న కేటగిరీలోకి వస్తాయి. మొత్తం రూ.13,165 కోట్లలో రూ.11,486 కోట్లు స్వదేశీ సంస్థలకే వెళతాయని కేంద్రం తెలిపింది.
హెచ్‌ఏఎల్...
ప్రధాన కార్యాలయం: బెంగళూరు
ప్రస్తుత చైర్మన్, ఎమ్‌డీ: ఆర్ మాధవన్
చదవండి: కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైన్యానికి అవసరమైన కొనుగోళ్లు చేయడానికి రూ.13,165 కోట్ల కేటాయింపులకు
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : భారత రక్షణ శాఖ
ఎందుకు : ఆర్మీ ఆధునీకరణ, సామర్థ్యం పెంపు కోసం...