ఎన్నికల సంస్కరణలకు..రాజ్యసభలోనూ ఆమోదం
Sakshi Education
ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానించడం సహా కీలక సంస్కరణలున్న ఎన్నికల చట్టాల సవరణ బిల్లు– 2021కి రాజ్యసభ డిసెంబర్ 21వ తేదీన మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
డిసెంబర్ 20వ తేదీన ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఆమోదం లభించడంతో తదుపరి దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపుతారు. గతంలో పలు పార్టీల అభిప్రాయాలను సేకరించిన ఎన్నికల కమిషన్ ఈ అనుసంధాన సూచన చేసింది. బోగస్ ఓటర్ల ఏరివేతకు దీనితో అడ్డుకట్ట వేయవచ్చని న్యాయమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
Published date : 22 Dec 2021 06:37PM