Maharastra Cabinet లోకి 18 మంది
Sakshi Education
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆగస్టు 9న కేబినెట్‌ను విస్తరించారు.
రెబెల్ శివసేన వర్గం, బీజేపీలకు చెరో 9 మంది చొప్పున మంత్రి పదవులు దక్కాయి. దీంతో, సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌తో కలిపి కేబినెట్ మంత్రుల సంఖ్య 20కి చేరింది. మహారాష్ట్ర కేబినెట్‌లోకి గరిష్టంగా 43 మందిని తీసుకునే అవకాశం ఉంది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా 18 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రమాణం చేయించారు. శాసనసభలోని 11 మంది, మండలిలోని ఒక సభ్యురాలితో కలిపి బీజేపీకి ఉభయ సభల్లో 12 మంది మహిళా సభ్యులుండగా, షిండే వర్గంలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు, ఇంకా స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరున్నారు. ఈ విస్తరణలో ఒక్క మహిళకు కూడా చోటుదక్కలేదు.
Also read: Quiz of The Day (August 10, 2022): హైదరాబాద్ అంబేద్కర్ గా ఎవరిని పేర్కొంటారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Aug 2022 05:52PM