Skip to main content

United Nations: ఐసిస్‌ అకృత్యాలపై ఐరాస విడుదల చేసిన నివేదిక పేరు?

UNO Logo 650x400

అఫ్గానిస్తాన్‌లో ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అకృత్యాలపై ‘‘14వ సెక్రటరీ జనరల్‌ రిపోర్టు’’ను ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసింది. అయితే ఈ నివేదికపై భారత్‌ అసహనం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్‌ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్‌ అసంతృప్తి తెలిపింది. పాక్‌ మద్దతుతో హక్కానీ నెట్‌వర్క్‌ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు.

ఐరాస దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

మొదటి ప్రపంచ యుద్దానంతరం ఏర్పడిన నానాజాతి సంస్థ (లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌) రెండో ప్రపంచ యుద్దాన్ని ఆపలేకపోయింది. ఫలితంగా ప్రపంచ శాంతి, దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్య సమితి (యునెటైడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌) ఏర్పడింది. ఈ రోజును ప్రతి ఏటా ఐరాస దినంగా నిర్వహిస్తారు. ఐరాస ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ ‘యునెటైడ్‌ నేషన్స్‌’ అనే పదాన్ని తొలిసారి ప్రవేశపెట్టాడు.

ఐరాస అధికార భాషలు ఏవి?

ఐరాస పతాకాన్ని 1947 అక్టోబరు 20న ఆమోదించారు. ఈ పతాకం లేత నీలం, తెలుపు రంగుల్లో ఉంటుంది. పతాకం మధ్యలో ఐరాస చిహ్నమైన ప్రపంచ పటం రెండు ఆలివ్‌ కొమ్మల మధ్య ఉంటుంది. ఆలివ్‌ కొమ్మలు శాంతికి చిహ్నం. ఐరాసాకి ఆరు అధికారిక భాషలున్నాయి అవి.. అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, అరబిక్‌. 1973లో అరబిక్‌ను ఆరో అధికార భాషగా చేర్చారు.

చ‌దవండి: నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ను ఎందుకోసం ఏర్పాటు చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
14వ సెక్రటరీ జనరల్‌ రిపోర్టు విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు    : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : అఫ్గానిస్తాన్‌లో ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Feb 2022 01:00PM

Photo Stories