ఫిబ్రవరి 2017 అంతర్జాతీయం
Sakshi Education
అమల్లోకి డబ్ల్యూటీఓ వాణిజ్య సదుపాయాల ఒప్పందం
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు చెందిన వాణిజ్య సదుపాయాల ఒప్పందం (ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్) ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చింది. కస్టమ్స్ నిబంధనల సరళీకరణ తదితర అంశాలకు ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని భారత్‌తో సహా డబ్ల్యూటీఓలోని రెండింట మూడొంతుల సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ ఒప్పందం కారణంగా ప్రపంచ వాణిజ్యం ఏటా ట్రిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది.
పీహెచ్‌డీలు యూఎస్‌లోనే అత్యధికం
పరిశోధన రంగంలో అత్యధిక పీహెచ్‌డీలు సాధిస్తున్న దేశాలకు సంబంధించి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ఫిబ్రవరి 27న విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధికంగా డాక్టరేట్ డిగ్రీలు పొందుతున్నారు. ఉన్నత విద్యపై కమిటీ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ పాలసీ- 2016, సెప్టెంబర్‌లో రూపొందించిన నివేదికను ఓఈసీడీ ఆమోదించింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘంగా పిలిచే ఓఈసీడీలో 35 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
2015లో వాయు కాలుష్యం వల్ల 42 లక్షల మంది మృతి
2015లో వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది మరణించారు. ఈ మొత్తంలో సగానికిపైగా (22 లక్షలు) భారత్, చైనాలకు చెందినవారే. ఈ మేరకు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఫిబ్రవరి 14న సర్వే వివరాలను వెల్లడించింది. 2015లో మానవుల ప్రాణాలను హరించిన కారణాల్లో వాయు కాలుష్యం ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 92 శాతం మంది ప్రజలు వాయుకాలుష్యం ఉన్న పరిసరాల్లో జీవిస్తున్నారు. వాయు కాలుష్యం చైనాలో అత్యధికంగా ఉండగా, భారత్ తర్వాతి స్థానంలో ఉంది. 1990 నుంచి 2015 మధ్య భారత్‌లో వాయు కాలుష్య మృతుల సంఖ్య 50 శాతం పెరిగిందని సర్వే తెలిపింది.
ఉగ్రవాదంపై జీ-20 కార్యబృందం ఏర్పాటు చేయండి: భారత్
ఉగ్రవాదంపై జీ-20 దేశాలతో కార్య బృందాన్ని ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. జర్మనీలోని బాన్ నగరంలో ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జరిగిన జీ-20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశంలో ఈ ప్రతిపాదన చేసింది. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు.
వెనెజువెలా ఉపాధ్యక్షుడిపై అమెరికా నిషేధం
వెనెజువెలా ఉపాధ్యక్షుడు తారెక్ ఎల్ ఐస్సామిపై అమెరికా నిషేధం విధించింది. అతడిని మత్తు పదార్థాల చేరవేతదారుడిగా గుర్తిస్తూ బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ శాఖ ఫిబ్రవరి 13న ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశ ఫారిన్ నార్కోటిక్స్ కింగ్‌పిన్ డిసిగ్నేషన్ యాక్ట్ కింద ఆయనపై నిషేధం విధించినట్లు తెలిపింది.
సయీద్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన పాకిస్తాన్
పాక్ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తున్నట్లు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఏటీఏ) నాలుగో జాబితాలో హఫీజ్, అతడు నిర్వహించే సంస్థలను ఫిబ్రవరి 18న చేర్చింది. ఈ జాబితా ప్రకారం ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు అనుమానితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో అవసరమున్న ప్రతీసారి కచ్చితంగా హాజరు కావలసి ఉంటుంది.
అమెరికా కాంగ్రెస్‌లో గ్రీన్‌కార్డుల చట్టసవరణ బిల్లు
గ్రీన్‌కార్డుల ద్వారా దేశంలోకి వస్తోన్న వారి సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం ప్రస్తుత చట్టాల సవరణకు ఉపక్రమించింది. ఈ మేరకు RAISE (the reforming american immigration for strong employment) బిల్లుని ఫిబ్రవరి 8న అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఏడాదికి పదిలక్షల మందికి గ్రీన్ కార్డులు ఇస్తుండగా దాన్ని ఐదు లక్షలకు తగ్గించే ఉద్దేశంతోనే ఈ బిల్లును రూపొందించారు. లాటరీల ద్వారా వీసాలిచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు.
సోమాలియా నూతన అధ్యక్షుడు అబ్దుల్లాహి ఫర్మాజో
సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి మహ్మద్ అబ్దుల్లాహి ఫర్మాజో ఎన్నికయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 8న ఆ దేశ పార్లమెంట్‌లో రెండు విడతలుగా జరిగిన ఓటింగ్‌లో ఫర్మాజోకి అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి హసన్‌కు 97 ఓట్లు, మాజీ అధ్యక్షుడు షరీఫ్ అహ్మద్‌కు 45 ఓట్లు దక్కాయి. 2009 నుంచి 2010 వరకూ ఫర్మాజో సోమాలియా ప్రధానిగా పనిచేశారు.
బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు పచ్చజెండా
యూరోపియన్ యూనియన్-EU నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇందుకోసం రూపొందించిన బిల్లుపై హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ఫిబ్రవరి 9న రెండోసారి ఓటింగ్ జరిగింది. మొత్తం సభ్యుల్లో 494 మంది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేయగా 122 మంది దీన్ని వ్యతిరేకించారు. ఫిబ్రవరి 2న మొదటి సారి జరిగిన ఓటింగ్‌లో 498 మంది అనుకూలంగా 114 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇందుకు అనుగుణంగా మార్చి 31 లోపు ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియకు బ్రిటన్ ప్రథాని థెరెసా మే చర్చలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత రెండేళ్లలో ఈ ప్రక్రియ ముగుస్తుంది.
వీసా ఆంక్షలను తిరస్కరించిన అమెరికా అప్పీల్ కోర్టు
ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ఆ దేశ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అప్పీల్ కోరు తిరస్కరించింది. ఈ మేరకు తొమ్మిదో సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఫిబ్రవరి 9న ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ట్రంప్ ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సియాటెల్ కోర్టు ఫిబ్రవరి 4న స్టే విధించింది. ఈ నిర్ణయంపై అప్పీల్ కోర్టుని ఆశ్రయించిన అమెరికా ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది. కోర్టు తీర్పులతో యూఎస్ ప్రభుత్వం ఇప్పటికే వీసా నిషేధాన్ని ఎత్తివేసింది.
ఆన్‌లైన్ షాపింగ్‌లో చైనీయులు టాప్
ఆన్‌లైన్ షాపింగ్‌లో చైనీయులదే అగ్రస్థానమని ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న నివేదిక విడుదల చేసింది. 36 శాతం మంది చైనీయులు వారానికి ఒకసారైనా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారని పేర్కొన్న సంస్థ అమెరికా 16 శాతం, జర్మనీ 15 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్, యూరప్‌లలోని 26 మార్కెట్ల నుంచి సేకరించిన గణాంకాలతో ఈ నివేదికను రూపొందించారు.
అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్లెర్సన్
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ప్రముఖ వ్యాపారవేత్త, ఎక్సాన్ మొబైల్ మాజీ సీఈవో టిల్లెర్సన్ ఫిబ్రవరి 2న బాధ్యతలు చేపట్టారు. ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది.
ట్రంప్‌పై పోరుకు ట్విట్టర్ విరాళం
ఏడు ఇస్లామిక్ దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్-ACLUకు వివిధ కంపెనీలు బాసటగా నిలుస్తున్నాయి. ఈ మేరకు ఆ సంస్థకు ట్విట్టర్ 1.59 మిలియన్ డాలర్ల (రూ.10.8 కోట్లు) విరాళం ప్రకటించింది.
వలసల నిషేధంపై వెనక్కి తగ్గిన అమెరికా
ఏడు ముస్లిం దేశాల పౌరులకు వీసాలు నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశంలోని సియాటెల్ కోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు నిర్ణయాల అమలుపై ఫిబ్రవరి 4న స్టే విధించింది. కోర్టు ఆదేశాలతో వలసలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం తీర్పుని పునర్ పరిశీలించాలంటూ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసింది. అయితే కిందిస్థాయి కోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను అమెరికా ఉన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది.
శ్రీలంకలో పాఠశాల ఏర్పాటుకు భారత్ సహాయం
శ్రీలంకలోని పొలన్నారువా జిల్లాలో విభిన్న తెగల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఏకాభిప్రాయ పత్రాలపై ఫిబ్రవరి 2న రెండు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఈ విద్యాలయంలో సిన్హాళీలు, తమిళులు, ముస్లింలకు సమాన అవకాశాలు కల్పించనున్నారు. మూడు భాషల్లో విద్యా బోధన అందించనున్న పాఠశాల నిర్మాణానికి భారత్ రూ.30 కోట్ల సహాయం అందిస్తుంది.
హెక్మత్యార్‌ను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించిన ఐరాస
అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని, మిలిటరీ కమాండర్ గుల్బుద్దీన్ హెక్మత్యార్‌ను ఉగ్రవాదుల జాబితా నుంచి ఐరాస తొలగించింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి కమిటీ ఫిబ్రవరి 4న నిర్ణయాన్ని వెల్లడించింది. జప్తులో ఉన్న అతడి ఆస్తులకు విముక్తి కల్పించడంతో పాటు ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్‌కు వ్యతిరేకి అయిన హెక్మత్యార్‌కు ‘కాబూల్ కసాయి’అనే పేరుంది. 1997 నుంచి పాకిస్తాన్‌లోనే ఉంటోన్న అతడికి పాక్ గూడఛారి సంస్థ (ISI) తో సన్నిహిత సంబంధాలు ఉండేవి.
రాణిగా 65 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలిజబెత్
ఇటీవలే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఫిబ్రవరి 6న రాణిగా 65 ఏళ్లు (sapphire jubilee) పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ఎక్కువకాలం సింహాసనాన్ని అధిరోహించిన బ్రిటన్ రాజ వంశస్తురాలిగా నిలిచారు.
ఎక్కువ దూరం ప్రయాణించే విమానం QR 920
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్‌వేస్ ప్రారంభించింది. దోహా విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 5న బయలుదేరిన క్యూఆర్ 920 విమానం ఫిబ్రవరి 6 ఉదయానికి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. ఏకధాటిగా 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ. పయనించి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. భూ ఉపరితలంపై ఉన్న దూరానికి అనుగుణంగా ప్రయాణించిన కిలోమీటర్లను లెక్కించారు. కాగా దూరాన్ని ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
సిరియాలో ఐదేళ్లలో 13 వేల మందికి ఉరి: ఆమ్నెస్టీ
సిరియా రాజధాని డమస్కస్‌లోని Saydnaya జైలులో గత ఐదేళ్లలో 13 వేల మందిని ఉరి తీశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 7న ఓ నివేదిక విడుదల చేసింది. జైలు గార్డులు, జడ్జీలు తదితర 84 మంది సాక్షుల సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించిన సంస్థ 2011-15 మధ్య వారానికి కనీసం 50 మంది ఖైదీలను రహస్యంగా ఉరితీసేవారని పేర్కొంది. బాధితుల్లో ఎక్కువగా ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన సామాన్య పౌరులేనని నివేదిక తెలిపింది.

Published date : 11 Feb 2017 10:26AM