Fungal Diseases: యాంటీబయాటిక్స్ అతి వాడకంతో ఇన్వాసివ్ కాండిడియాసిస్
Sakshi Education
Fungal Diseases: ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకేందుకు కారణమైన ఫంగస్?
యాంటీబయాటిక్స్ అతిగా వాడితే రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకేందుకు కాండిడా అనే ఫంగస్ కారణం. ఈ ఫంగస్ సోకేందుకు యాంటీ బయాటిక్స్ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్‌హామ్ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది.
Published date : 24 May 2022 03:52PM