Black Hole: కృష్ణ బిలం వినిపించింది!
Sakshi Education
అంతరిక్షంలో ఉండే కృష్ణ బిలాలు(బ్లాక్ హోల్స్) గురించి మనకు తెలుసు. వాటిలో నుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతూ ఉంటాయి. అవి ఎలాంటి శబ్దాలు అన్న సంగతి తెలియదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు ఈ విషయంలో కొంత పురోగతి సాధించారు.
బ్లాక్ హోల్ నుంచి చిన్నపాటి ప్రతిధ్వనులను రికార్డు చేసి, స్పష్టమైన శబ్దంగా మార్చారు. ఇందుకోసం సొనిఫికేషన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. సంబంధిత శబ్దంతో కూడిన వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇది భూమికి 7,800 కాంతి సంత్సరాల దూరంలో ఉన్న వీ404 సైగ్నీ అనే బ్లాక్‌హోల్‌కు సంబంధించినదని వెల్లడించారు. నాసా విడుదల చేసిన వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే 40 లక్షల మందికిపైగా జనం వీడియోను తిలకించారు. కృష్ణ బిలం శబ్దం కొత్తగా ఉందంటూ నెటిజన్లు పోస్టు చేశారు. ఇసుకపై నుంచి దూసుకొచ్చే సముద్ర అలల ధ్వనిలా ఉందని కొందరు పేర్కొన్నారు.
NASA:చంద్రుని చెంతకు ఓరియాన్.. చరిత్ర సృష్టించిన నాసా మిషన్
Published date : 28 Nov 2022 05:24PM