Skip to main content

NATO: నాటోలోకి ఫిన్లాండ్‌

finland joining nato news

ఐరోపా సమాఖ్యలోని కీలక దేశం ఫిన్లాండ్‌.. నా­టో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది. ఇందుకు సంబంధించిన చేరిక ప­త్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావి­స్టో.. అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌­కు అందజేశారు. అంతకుముందు ఫిన్లాండ్‌ చేరికను బ్లింకెన్‌ ప్రకటించారు. నాటో సభ్యత్వానికి సంబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ భద్రపరుస్తుంటుంది. నాటోలో ఫిన్లాండ్‌ చేరేందుకు చివరగా ఆమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 17 Apr 2023 05:45PM

Photo Stories