Skip to main content

UN report: స్వచ్ఛమైన తాగునీటికి 26 శాతం మంది దూరం

26 percent away from clean drinking water: UN report

ప్రపంచ జనాభాలో 26 శాతం మంది స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా ఉన్నారని..46 శాతం మందికి కనీస పారిశుద్ధ్యం అందుబాటులో లేదని ఐక్యరాజ్యసమితి (ఐరాస) వెల్లడించింది. 45 ఏళ్ల తర్వాత జలవనరులపై మొదటిసారిగా ఐరాస సుదీర్ఘ సదస్సు నిర్వహించింది. ఆ అంశాలను ప్రస్తావిస్తూ ‘ఐరాస ప్రపంచ జల అభివృద్ధి నివేదిక–2023’ ను విడుదల చేసింది. 2030లోగా ప్రపంచ జనాభా మొత్తం శుద్ధ జలం, పారిశుద్ధ్యాన్ని పొందాలన్న లక్ష్యాలను చేరుకోవడానికి..ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి 600 బిలియన్‌ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్‌ డాలర్లు అవసరమని నివేదిక వెల్లడించింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:45PM

Photo Stories