యురేనియంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
Sakshi Education
పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమల అడవులతోపాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా యురేనియం తవ్వకాలను అనుమతించేదిలేదని తెలంగాణ శాసనసభ తీర్మానించింది.
యురేనియం నిక్షేపాల తవ్వకాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కె. తారక రామారావు సెప్టెంబర్ 16న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికతతో పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని.. యురేనియం తవ్వకాల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం ఏకీభవిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యురేనియంకు అనుమతించం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : తెలంగాణ అసెంబ్లీ
ఎక్కడ : తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : యురేనియంకు అనుమతించం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : తెలంగాణ అసెంబ్లీ
ఎక్కడ : తెలంగాణ
Published date : 17 Sep 2019 05:36PM