Skip to main content

యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు

తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి అటామిక్ మినరల్ డెరైక్టరేట్ (ఏఎండీ)కు తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి.
యురేనియం నిల్వలున్నాయో లేదో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌తోపాటు వెలికితీతకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తెలంగాణ అటవీ శాఖ నవంబర్ 13న స్పష్టం చేసింది. నల్లమలలో 4 వేల బోర్లు వేసి యురేనియం అన్వేషిస్తామంటూ ఏఎండీ పంపించిన కొత్త ప్రతి పాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. యురేనియం అన్వేషణకు 2016 డిసెంబర్‌లో తెలంగాణ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం ఇచ్చిన అనుమతులు, ఒప్పందాలు రద్దయినట్టుగా ఏఎండీ, కేంద్ర అటవీశాఖ, కేంద్ర వన్యప్రాణి బోర్డుకు లేఖలు పంపింది.

యురేనియం నిక్షేపాల పరిశోధన, తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం విదితమే.

క్విక్ రివ్యూ :
ఏమిటి : యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : తెలంగాణ అటవీ శాఖ
ఎక్కడ : నల్లమల అటవీ ప్రాంతం, తెలంగాణ
Published date : 14 Nov 2019 05:30PM

Photo Stories