యుద్ధనేరాల విచారణకు ఐరాస నిధులు
Sakshi Education
సిరియా, మయన్మార్‌లలో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
2020 సంవత్సరానికి గాను ఐరాస సర్వ ప్రతినిధి సభ డిసెంబర్ 27న 307 కోట్ల డాలర్లను కేటాయించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే బడ్జెట్ స్వల్పంగా పెరిగింది. 2019లో 290 కోట్ల డాలర్ల బడ్జెట్ ఉండేది. యెమన్‌లో పరిశీలకుల బృందం, హైతిలో రాజకీయ బృందాల ఏర్పాటు, సిరియా అంతర్యుద్ధం, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన దాడులకు సంబంధించిన నేరాలపై విచారణకు ఈ బడ్జెట్‌లో నిధుల్ని వినియోగించనున్నారు. ఇలా యుద్ధ నేరాల విచారణకు ఐక్యరాజ్య సమితి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.
గతంలో యూఎన్ స్వచ్ఛందంగా ఈ నేరాల విచారణకు ఆర్థిక సాయాన్ని అందించేది. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం 600 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యుద్ధ నేరాల విచారణ కోసం నిధుల కేటాయింపు
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : సిరియా, మయన్మార్

Published date : 30 Dec 2019 06:05PM