యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
Sakshi Education
భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ’ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా ల్యాండ్ అయింది.
ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై జనవరి 11న తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను డీఆర్‌డీవో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్‌ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
క్విక్ రివ్యూ :
ఏమిటి : యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
Published date : 13 Jan 2020 05:49PM