యెమెన్ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు
Sakshi Education
యెమెన్‌లోని ఏడెన్ నగర విమానాశ్రయంలో డిసెంబర్ 30న భారీ పేలుడు జరిగింది.
ప్రధానమంత్రి మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్ సహా పలువురు మంత్రులతో కూడిన విమానాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది. పేలుడుకు కారకుల వివరాలు తెలియరాలేదు. పేలుడులో 22మంది పౌరులు మరణించగా, 50మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలియగానే ప్రధానితో సహా మంత్రులందరు ఏడెన్‌లోని ప్యాలెస్‌కు తరలిపోయారు. అయితే ప్యాలెస్‌కు సమీపంలోకూడా మరో పేలుడు సంభవించింది. అయితే దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలియరాలేదు.
2014 నుంచి...
- 2014 నుంచి యెమెన్‌లో పౌరయుద్ధం, అశాంతి కొనసాగుతున్నాయి.
- సౌదీ అరెబియా బలపరిచే ప్రభుత్వాధినేత మన్సూర్ హది, దక్షిణాన యూఏఈ బలపరిచే సెపరేటిస్టులు, ఇతర ప్రాంతంలో ఇరాన్ బలపరిచే హౌతి రెబెల్స్ మధ్య పట్టుకోసం పోరాటం కొనసాగుతోంది.
- తాజాగా హది, సదరన్‌సెపరేటిస్టుల సంతృప్తి కోసం వారిని కూడా కలుపుకొని కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
- యెమెన్ అంతర్యుద్ధంలో ఇప్పటికి దాదాపు 1.12 లక్షల మంది మరణించారు.
యెమెన్ రాజధాని నగరం: సనా; కరెన్సీ: యెమెని రియాల్
యెమెన్ ప్రస్తుత అధ్యక్షుడు: అబ్‌ద్రాబ్దు మన్సూర్ హది
యెమెన్ ప్రస్తుత ప్రధాని: మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్
Published date : 31 Dec 2020 06:03PM