Skip to main content

వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీను ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బ్యాంక్?

ఆసియా పసిఫిక్ దేశాల కూటమిలోని (ఏపీఏసీ) వర్ధమాన ఎకానమీలు కోవిడ్-19 టీకాలను కొనుగోలు, పంపిణీ చేసేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆర్థికపరమైన తోడ్పాటు అందించనుంది.
Current Affairs
ఇందుకోసం 9 బిలియన్ డాలర్లతో ఆసియా-పసిఫిక్ వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీ (ఏపీవ్యాక్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకావా డిసెంబర్ 11న తెలిపారు. వర్ధమాన దేశాలు.. కరోనా మహమ్మారిపరమైన సవాళ్లను అధిగమించి, ఆర్థిక రికవరీపై దృష్టి పెట్టేందుకు ఏపీవ్యాక్స్ తోడ్పడగలదని ఆయన వివరించారు.

బ్లాక్‌స్టోన్ చేతికి పిరమల్ గ్లాస్...
పిరమల్ గ్లాస్ కంపెనీని బ్లాక్‌స్టోన్ సంస్థ వంద కోట్ల డాలర్లకు (రూ.7,500 కోట్లు)కొనుగోలు చేయనున్నది. 1,000 కోట్ల డాలర్ల పిరమల్ గ్రూప్‌నకు చెందిన పిరమల్ గ్లాస్ కంపెనీ ప్రత్యేకమైన గ్లాస్ రకాలను తయారు చేస్తోంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 9 బిలియన్ డాలర్లతో ఆసియా-పసిఫిక్ వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీ (ఏపీవ్యాక్స్) ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
ఎందుకు : ఆసియా పసిఫిక్ దేశాల కూటమిలోని (ఏపీఏసీ) వర్ధమాన ఎకానమీలు కోవిడ్-19 టీకాలను కొనుగోలు, పంపిణీ చేసేందుకు
Published date : 12 Dec 2020 05:37PM

Photo Stories