Skip to main content

వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్‌తో పనిచేస్తాం: రష్యా

కోవిడ్‌ –19ను ఎదుర్కొనేందుకు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్‌-5 ఉత్పత్తి కోసం భారత్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సీఈఓ కిరిల్‌ దిమిత్రివ్‌ చెప్పారు. స్పుత్నిక్‌ టీకానుఈర్‌డీఐఎఫ్‌తో కలిసి గమలేయా రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది.
Current Affairs
ఈ వ్యాక్సిన్ ను సమర్ధవంతంగా ఉత్పత్తి చేసే సామర్ధ్యం భారత్‌కు ఉంది. ప్రస్తుత డిమాండ్‌ తట్టుకోవాలంటే ఇలాంటి భాగస్వామ్యాలు అవసరం అని ఆగస్టు 20న కిరిల్‌ తెలిపారు.

2020 ఏడాది చివరికి వ్యాక్సిన్‌: హర్షవర్థన్‌
2020 ఏడాది చివరి నాటికి దేశంలో కోవిడ్‌ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో రెండు భారత్‌కు చెందిన సంస్థలు తయారు చేస్తుండగా, ఇంకోటి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేస్తోంది. భారత్‌ బయోటెక్, జైడస్‌ కాడిలా టీకా ప్రయోగాలు మొదటి దశ మానవ ప్రయోగాలను ముగించుకొని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా రెండు, మూడు దశల మానవ ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్‌తో పనిచేస్తాం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)
ఎందుకు :స్తుత డిమాండ్‌ తట్టుకోవాలంటే ఇలాంటి భాగస్వామ్యాలు అవసరం అని
Published date : 24 Aug 2020 08:28PM

Photo Stories