వుహాన్ పేరుతో ఉప్రగ్రహం రూపకల్పన
ఈ రెండు ఉపగ్రహాలలో ఒక ఉపగ్రహానికి ‘వుహాన్’గా నామకరణం చేసినట్లు చైనా అధికార వార్తా సంస్థ షిన్హువా ఏప్రిల్ 3న తెలిపింది. క్వాయిజౌ-1ఏ అనే రాకెట్ ద్వారా ఈ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. జింగ్‌యున్ ఇంజినీరింగ్ ప్రాజెక్టులో భాగంగా భూమికి దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టే మొత్తం 80 ఉపగ్రహాల్లో ఇవి మొదటివి. సముద్రాలు, అడవులు, ఇంజినీరింగ్ యంత్రాల కమ్యూనికేషన్ల కోసం ఈ ఉపగ్రహాలను రూపొందించారు.
వుహాన్ పేరు ఎందుకు...
కోవిడ్-19 మహమ్మారి తొలిసారి చైనాలోని వుహాన్‌లోనే వెలుగుచూసింది. అక్కడి సముద్ర ఆహార మార్కెట్లో పుట్టిన ఈ వైరస్ నేటికి పది లక్షల మందికిపైగా సోకింది. అయితే వుహాన్‌లోనే చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఏఎస్‌ఐసీ)కి చెందిన సంజియాంగ్ సంస్థ ఉంది. కరోనా వైరస్ భయం ఉన్నప్పటికీ ఇక్కడి సిబ్బంది శ్రమించి ఉపగ్రహాన్ని రూపొందించారు. అందుకే దానికి ‘వుహాన్’ అని పేరు పెట్టారని షిన్హువా వెల్లడించింది. ఏప్రిల్ 2నాటికి చైనాలో 81,620 కొవిడ్-19 కేసులు నమోదు కాగా 3,322 మంది మృతిచెందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వుహాన్ పేరుతో ఉప్రగ్రహం రూపకల్పన
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఏఎస్‌ఐసీ)
ఎందుకు : రోదసి ఆధారిత ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ప్రాజెక్ట్ కోసం