వరంగల్ జౌళి పార్కులో యంగ్వన్ పరిశ్రమ
Sakshi Education
వరంగల్‌లోని మెగా జౌళి పార్కులో రూ. 900 కోట్ల పెట్టుబడులతో యంగ్వన్ కార్పొరేషన్ పరిశ్రమను స్థాపించనుంది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో డిసెంబర్ 11న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ పరిశ్రమకు 290 ఎకరాల భూకేటాయింపు పత్రాలను మంత్రులు ఆ సంస్థ ప్రతినిధులకు అందజేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా 12 వేల మందికి ఉపాధి కల్పిస్తామని యంగ్వన్ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ. 900 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ స్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : యంగ్వన్ కార్పొరేషన్
ఎక్కడ : వరంగల్‌లోని మెగా జౌళి పార్కు
Published date : 13 Dec 2019 06:30PM