Skip to main content

వందకు పైగా దేశాలకు క‌రోనా వ్యాక్సిన్‌

బడ్జెట్ ప్ర‌సంగంలో భాగంగా కోవిడ్ వ్యాక్సీన్ గురించి మాట్లాడిని నిర్మలా సీతారామన్ భారత ప్రభుత్వం కేవలం భారత పౌరులకే కాదు, మరో వంద దేశాల ప్రజలకు కోవిడ్-19 నుంచి ఉపశమనం అందిస్తోందని చెప్పారు.
Current Affairs"భారత్ దగ్గర ప్రస్తుతం రెండు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో భారత పౌరులకు సురక్షా కవచం అందించడం ప్రారంభించాం. దానితోపాటూ వందకు పైగా దేశాలకు కూడా కోవిడ్ 19 నుంచి రక్షణ అందించడం ప్రారంభించాం. త్వరలోనే మిగతా వ్యాక్సీన్లు కూడా అందుబాటులోకి వస్తాయని తెలియడం ఉపశమనం కలిగిస్తోంది" అని సీతారామన్ అన్నారు.

మరో కోటి మందికి ఉజ్వల పథకం
రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేస్తామ‌ని ఆర్థిక మంత్రి తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామ‌ని, మరో కోటి మందికి ఉజ్వలసాయం అందిస్తామ‌ని అన్నారు. జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేస్తామ‌న్నారు. రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2లక్షల కోట్లు కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు.
Published date : 01 Feb 2021 12:22PM

Photo Stories