విశ్వసుందరిగా జోజిబిని తుంజి
Sakshi Education
విశ్వసుందరి(మిస్ యూనివర్స్)-2019గా దక్షిణాఫ్రికాలోని ట్సోలో పట్టణానికి చెందిన జోజిబిని తుంజి ఎంపికయ్యారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో ఉన్న టైలర్ పెర్రీ స్టూడియోస్‌లో డిసెంబర్ 8న జరిగిన అందాల పోటీల్లో 26 ఏళ్ల తుంజీని విజేతగా ప్రకటించారు.
అనంతరం మిస్ యూనివర్స్-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్స్) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించింది. ఈ సందర్భంగా తుంజీ మాట్లాడుతూ.. ‘నా రంగు, నా జుట్టును చూసి ఎవరూ అందంగా ఉందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇక అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదే అని నేను భావిస్తున్నా’ అని ఉద్వేగానికి లోనయ్యారు. లింగ ఆధారిత వివక్ష, హింసకు వ్యతిరేకంగా తుంజీ పోరాటం చేస్తున్నారు.
మొత్తం 90 మంది పాల్గొన్న ఈ అందాల పోటీలకు పాపులర్ టీవీ పర్సనాలిటీ స్టీవ్ హార్వే హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ పోటీలలో మిస్ పొర్టొ రీకో ఫస్ట్ రన్నరప్‌గా, మిస్ మెక్సికో సెకండ్ రన్నరప్‌గా నిలిస్తే భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వర్తికా సింగ్ టాప్ 20 స్థానాలలో నిలిచి సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశ్వసుందరి(మిస్ యూనివర్స్)-2019గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : జోజిబిని తుంజి
ఎక్కడ : అట్లాంటా, జార్జియా, అమెరికా

Published date : 09 Dec 2019 06:07PM