విశ్వనాథన్ ఆనంద్ పుస్తకం మైండ్‌మాస్టర్ విడుదల
Sakshi Education
భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రచించిన ‘మైండ్ మాస్టర్’ పుస్తకం విడుదలైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో డిసెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో ది హిందు పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ... ‘మీరు చెస్ రొమాంటిక్ అయితే ఈ ఆట అందాన్ని ఆస్వాదిస్తారు. ఈ కంప్యూటర్ల యుగంలోనూ చెస్ ఆట అనుభూతే వేరు. కంప్యూటర్లు కూడా అంతే అనంతమైన సాధ్యాల్ని సాకారం చేస్తాయి’ అని అన్నాడు. తన పుస్తకంలో చెస్ గడులతో పాటు కంప్యూటర్‌కూ చోటిచ్చానని పేర్కొన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశ్వనాథన్ ఆనంద్ రచించిన మైండ్ మాస్టర్పుస్తకం విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ది హిందు పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశ్వనాథన్ ఆనంద్ రచించిన మైండ్ మాస్టర్పుస్తకం విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ది హిందు పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
Published date : 14 Dec 2019 05:36PM