Skip to main content

విమానాన్ని పొరపాటున కూల్చేశాం : ఇరాన్

ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్ తెలిపింది.
Current Affairsమానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జనవరి 11న ప్రకటించారు. ఈ సంఘటన క్షమించరాని తప్పిదం అని అంగీకరించారు. తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. ఇరాన్ ఒప్పుకోలుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్‌స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు.

2020, జనవరి 8న టెహ్రాన్‌లోని ఎయిర్‌పోర్ట్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయలుదేరిన ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం టేకాఫ్ తీసుకున్న రెండు నిమిషాల్లో కూలడం, అందులోని 176 మంది మరణించడం తెల్సిందే. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్ ఇన్నిరోజులూ చెప్పింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశాం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ
Published date : 13 Jan 2020 05:51PM

Photo Stories