విజయవాడలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఫిబ్రవరి 5న ది హిందూ గ్రూపు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ సదస్సును నిర్వహించింది.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఇవాళ అవసరమే కానీ విలాసం కాదని అన్నారు. రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లిష్ మీడియం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పును తెచ్చేందుకు నాడు- నేడు, పౌష్టికాహారం, అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది హిందూ గ్రూపు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది హిందూ గ్రూపు ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 06 Feb 2020 06:02PM