విజయ్ దివస్
Sakshi Education
బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్‌లోభారత్ విజయానికి గుర్తుగా <b>ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్</B> వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా 2020 ఏడాది ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని ప్రధాని నరేంద్ర మోదీ వెలిగించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఏడాది పాటు జరగనున్న స్వర్ణ విజయోత్సవాల (50వ వార్షికోత్సవాలు)ను మోదీ ప్రారంభించారు.
విజయ్ దివస్ వేడుకల సందర్భంగా నాలుగు విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు భారత రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది.

Published date : 17 Dec 2020 07:23PM