Skip to main content

వేదాంత నాన్‌–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అనిల్‌ అగర్వాల్

మైనింగ్‌ మ్యాగ్నెట్‌ అనిల్‌ అగర్వాల్‌.. వేదాంత లిమిటెడ్ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.
Current Affairsఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్‌ అగర్వాల్‌ సోదరుడు నవీన్‌ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా నవీన్‌ వ్యవహరిస్తారని మార్చి 29న కంపెనీ పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్‌. వెంకటకృష్ణన్‌ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మ‌రోవైపు హిందుస్తాన్‌ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్‌ దుగ్గల్‌ను వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది. అనిల్ అగ‌ర్వాల్ ఇప్పటివరకు ఆయన లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వేదాంతా రిసోర్సెస్‌ బోర్డు బాధ్యతలు చూశారు.
Published date : 30 Mar 2020 07:01PM

Photo Stories