Skip to main content

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం తొలుత ఎప్పడు ప్రారంభమైంది?

సకాలంలో రుణాలు చెల్లించిన 9.34 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మంది పొదుపు మహిళలకు వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1,109 కోట్లు విడుదలయ్యాయి.
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 23న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పొదుపు మహిళల ఖాతాల్లో ఈ సోమ్మును జమ చేశారు. పొదుపు సంఘాల మహిళలకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం తొలుత 2020, ఏప్రిల్‌ 24న ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్నంతటినీ ఇకపై ప్రభుత్వమే భరించనుంది.

ఉచితంగా వ్యాక్సిన్‌...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారందరికీ ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

ఉల్లిపాలెం వారధికి బ్రాహ్మణయ్య పేరు
కృష్ణాజిల్లా ఉల్లిపాలెం–భవానీపురం వారధి ఇకమీదట అంబటి బ్రాహ్మణయ్య వారధిగా మారనుంది. ఈ వారధికి అంబటి బ్రాహ్మణయ్య వారధిగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 23న ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 24 Apr 2021 06:22PM

Photo Stories