వైఎస్సార్ నేతన్న నేస్తం అమలుకు ఉత్తర్వులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 23న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకం కింద సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు.
రాష్ట్రంలో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలు 75,243 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తిచింది. ఈ కుటుంబాలకు డిసెంబర్ నెలలో రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.180.58 కోట్లు అవసరమని అంచనా వేసింది. బడ్జెట్‌లో చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.200 కోట్లు కేటాయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలుకు ఉత్తర్వులు
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Published date : 25 Oct 2019 05:34PM