వాయిస్ ఆఫ్ కస్టమర్ గుర్తింపు పొందిన విమానాశ్రయం?
2020 ఏడాదిలో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఫిబ్రవరి 9న వెల్లడించాయి. కోవిడ్-19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ-బోర్డింగ్ సదుపాయం కల్పించిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది.
బయో ఆసియా సదస్సు...
ఆసియాలోనే అతిపెద్ద జీవశాస్త్ర, ఆరోగ్య రంగ సదస్సు ‘బయో ఆసియా’ 2021, జనవరి 22, 23 తేదీల్లో వర్చువల్ విధానంలో జరగనుంది. కోవిడ్-19తో పాటు ప్రపంచ ఆరోగ్యం, ఫార్మా, మెడ్‌టెక్ అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు పొందిన విమానాశ్రయం
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(శంషాబాద్ ఎయిర్‌పోర్టు)
ఎందుకు : 2020 ఏడాదిలో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను