Skip to main content

వారణాసిలో రూ. 614 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9న వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో శ్రీకారం చుట్టారు.
Current Affairs
ఈ దీపావళి పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు.

ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో...
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్ అధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 10న వర్చువల్ వేదికగా భేటీకానున్నారు. ఈ సమావేశాల్లో రాజకీయాలు, భద్రత, ఆర్థిక వాణిజ్యం లాంటి విషయాలపై దృష్టి సారించి, ప్రపంచ పరిస్థితులపై మాస్కో డిక్లరేషన్‌ను రూపొందించనున్నారు. కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ వార్షిక సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహిస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
Published date : 10 Nov 2020 05:36PM

Photo Stories