వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
Sakshi Education
కేంద్ర వాణిజ్య శాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ సెప్టెంబర్ 15న బులెటిన్ విడుదల చేసింది. ఈ కమిటీలో వివిద పార్టీలకు చెందిన 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. వాణిజ్య శాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
మరికొన్ని కమిటీల ఏర్పాటు
వాణిజ్య కమిటీతో పాటు ఇతర శాఖలకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా జయంత్ సిన్హా (బీజేపీ) నియమితులయ్యారు. అలాగే హోం శాఖ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఆనంద్‌శర్మ(కాంగ్రెస్), పశ్రమలశాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కేశవరావు (టీఆర్‌ఎస్), రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ కమిటీ చైర్మన్‌గా టీజీ వెంకటేశ్(బీజేపీ) నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర వాణిజ్య శాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : వి.విజయసాయిరెడ్డి
ఎందుకు : వాణిజ్య శాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులను పరిశీలించేందుకు

Published date : 16 Sep 2019 05:30PM