Skip to main content

ఉమఖనోవ్ బాక్సింగ్‌లో రెండు స్వర్ణాలు

మగోమెడ్ సాలమ్ ఉమఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
భారత మహిళా బాక్సర్లు నీరజ్ (56 కేజీలు), లవ్లీనా (69 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. రష్యాలోని కాస్‌పియ్‌స్క్‌లో ఆగస్టు 3న జరిగిన ఫైనల్లో నీరజ్ 3-0తో మలిక (రష్యా)పై...లవ్లీనా 3-2తో అసుంటా (ఇటలీ)పై గెలుపొందారు. మరోవైపు పురుషుల విభాగంలో గౌరవ్ సోలంకి (56 కేజీలు) రజత పతకం గెలుచుకోగా, గోవింద్ సహాని (49 కేజీలు)కి కాంస్యం దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మగోమెడ్ సాలమ్ ఉమఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : నీరజ్ (56 కేజీలు), లవ్లీనా (69 కేజీలు)
ఎక్కడ : కాస్‌పియ్‌స్క్, ర ష్యా
Published date : 05 Aug 2019 05:38PM

Photo Stories