ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో జెలెన్‌స్కీ విజయం
Sakshi Education
ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో హాస్య నటుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో జెలెన్‌స్కీకి 73.22 శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పొరోషెంకోకు 24.46 శాతం ఓట్లు దక్కాయి. వాస్తవానికి 2019, మార్చి 31న ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే స్పష్టమైన ఫలితాలు రాకపోవడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జెలెన్ స్కీ, పొరోషెంకో మధ్య రెండో రౌండ్ ఎన్నికలు ఈ నెల 21న నిర్వహించారు. ‘సర్వంట్ ఆఫ్ ది పీపుల్’ కామెడీ టీవీ సీరియల్‌లో జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటించారు. ఈ సీరియల్ నెలరోజుల కిందట ముగిసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : హాస్య నటుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : హాస్య నటుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ
Published date : 23 Apr 2019 06:05PM