టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో టైటిల్ విజేత?
Sakshi Education
టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
ఇటలీలోని టస్కన్‌లో సెప్టెంబర్ 13న జరిగిన ఈ రేసును పోల్ పొజిషన్‌తో ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 59 ల్యాప్‌లను 2 గంటల 19 నిమిషాల 35.060 సెకన్లలో ముగించి తన కెరీర్‌లో 90వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ క్రీడ చరిత్రలో 1000వ రేసులో బరిలోకి దిగిన ఫెరారీ జట్టుకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్‌లెర్క్ 8వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు... సెబాస్టియన్ వెటెల్ 10వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకున్నారు. తొమ్మిది రేసుల తర్వాత హామిల్టన్ 190 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 27న సోచి నగరంలో జరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : టస్కన్, ఇటలీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : టస్కన్, ఇటలీ
Published date : 14 Sep 2020 06:13PM