ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
Sakshi Education
ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర కేబినెట్ జూన్ 12న ఆమోదించింది.
ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్‌సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్‌ఈజెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్‌ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 13 Jun 2019 05:46PM