టోక్యో ఒలింపిక్స్‌కు హార్స్ రైడర్ మీర్జా అర్హత
Sakshi Education
2020 టోక్యో ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్‌లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మీర్జా అర్హత సాధించాడు.
ఈక్వెస్ట్రియన్ స్పోర్‌ట్స ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్ ప్రకారం ఫౌద్ మీర్జా టోక్యో ఒలింపిక్స్‌కు అధికారికంగా బెర్త్ ఖాయం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం 2019 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య కాలంలో కనబరిచిన ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్నారు.
ఫౌద్ మీర్జాకంటే ముందు భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇంతియాజ్ అనీస్... 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో ఐజే లాంబా భారత్ తరఫున ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో బరిలోకి దిగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌కు అర్హత
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ఫౌద్ మీర్జా
మాదిరి ప్రశ్నలు

1. 2020 టోక్యో ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్‌లో పాల్గొననున్న భారత క్రీడాకారుడు?
1. తేజిందర్ పాల్ సింగ్ తూర్
2. ఫౌద్ మీర్జా
3. బజ్రంగ్ పూనియా
4. కిడాంబి శ్రీకాంత్
- View Answer
- సమాధానం : 2
2. భారత్, పాకిస్తాన్ మధ్య 2019, నవంబర్ 29, 30 తేదీల్లో ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ మ్యాచ్ ఎక్కడ జరిగింది?
1. కొల్కతా
2. లాహోర్
3. నూర్ సుల్తాన్
4. ఇస్లామాబాద్
- View Answer
- సమాధానం : 3
Published date : 08 Jan 2020 05:36PM