Skip to main content

తక్కువ వడ్డీ దారిలో ఆర్‌బీఐ: ఫిచ్

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- ఫిచ్ పేర్కొంది.
దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్‌బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితులు... ఆర్‌బీఐ రేటు తగ్గింపునకు దోహదపడుతున్న అంశాలుగా ఫిచ్ వివరించింది. ఈ మేరకు ఆసియా పసిఫిక్ సావరిన్ క్రెడిట్ ఓవర్‌వ్యూ రిపోర్ట్‌ను ఫిచ్ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా, 2020-21లో 7.1 శాతాంగా నమోదవుతుందని ఫిచ్ అంచనా వేసింది.

ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏప్రిల్ 4న రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది.
Published date : 25 Apr 2019 05:17PM

Photo Stories