Skip to main content

తజికిస్తాన్‌ దేశ రాజధాని నగరం పేరు?

పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పిలుపునిచ్చారు.
Current Affairs
తజికిస్తాన్‌ రాజధాని డషంబేలో జూన్‌ 23న ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సమావేశానికి దోవల్‌ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాద సంస్థకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం ఎస్‌సీఓ, యాంటీ టెర్రర్‌ వాచ్‌డాగ్‌ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) మధ్య ఒక అవగా హన ఒప్పందం కుదరాలని సూచించారు.

ఎస్‌సీఓలో...
ఎస్‌సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40 శాతం ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని నగరం బీజింగ్‌లో ఉంది.
Published date : 25 Jun 2021 06:28PM

Photo Stories