టీఎస్‌ఎఫ్‌సీవోఎఫ్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు
Sakshi Education
మత్స్యరంగంలో ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌సీవోఎఫ్)కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది.
ఇన్‌ల్యాండ్ (సముద్రేతర ప్రాంతాల్లో మత్స్య రంగ అభివృద్ధి) కేటగిరీ కింద రాష్ట్ర మత్స్యశాఖకు ఈ అవార్డు దక్కింది. నవంబర్ 21న ఢిల్లీలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి చేతుల మీదుగా తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ ఇన్‌చార్జి కమిషనర్ అనితా రాజేంద్ర ఈ అవార్డు అందుకున్నారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతిని స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌ల్యాండ్ కేటగిరిలో జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌సీవోఎఫ్)
ఎందుకు : మత్స్యరంగంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌ల్యాండ్ కేటగిరిలో జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌సీవోఎఫ్)
ఎందుకు : మత్స్యరంగంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు
Published date : 23 Nov 2020 05:57PM