Skip to main content

టీఎస్‌ఐడీసీగా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా అమరవాది లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.
Current Affairs
ఈ మేరకు నియామక పత్రాన్ని జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నవంబర్ 15న అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పనిచేశారు. పలు వ్యాపార సంఘాలు, సామాజిక సేవా సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో ఐఎస్ సదన్ డివిజన్ నుంచి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రం లోని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు టీఎస్‌ఐడీసీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : అమరవాది లక్ష్మీనారాయణ
Published date : 16 Nov 2020 05:48PM

Photo Stories