Skip to main content

టెస్టుల్లో 600 వికెట్లు తీసిన తొలి పేస్‌ బౌలర్‌

టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్‌ బౌలర్‌గా ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్ రికార్డు నెలకొల్పాడు.
Current Affairs
ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో పాకిస్తాన్ తో ఆగస్టు 25న ‘డ్రా’గా ముగిసిన మూడో టెస్టులో 38 ఏళ్ల అండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్న ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక–800 వికెట్లు), షేన్ వార్న్‌ (ఆ్రస్టేలియా–708 వికెట్లు), అనిల్‌ కుంబ్లే (భారత్‌–619 వికెట్లు) స్పిన్నర్లే కావడం గమనార్హం.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (టాప్‌–10)

బౌలర్‌

దేశం

టెస్టులు

వికెట్లు

మురళీధరన్

శ్రీలంక(స్పిన్‌ బౌలర్)

133

800

షేన్ వార్న్‌

ఆ్రస్టేలియా(స్పిన్‌ బౌలర్)

145

708

అనిల్‌ కుంబ్లే

భారత్‌(స్పిన్‌ బౌలర్)

132

619

అండర్సన్

ఇంగ్లండ్‌(పేస్‌ బౌలర్)

156

600

మెక్‌గ్రాత్‌

ఆ్రస్టేలియా(పేస్‌ బౌలర్)

124

563

స్టువర్ట్‌ బ్రాడ్‌

ఇంగ్లండ్‌(పేస్‌ బౌలర్)

143

514

స్టెయిన్

దక్షిణాఫ్రికా(పేస్‌ బౌలర్)

93

439

కపిల్‌ దేవ్‌

భారత్‌(పేస్‌ బౌలర్)

131

434

రంగనహెరాత్‌

శ్రీలంక(స్పిన్‌ బౌలర్)

93

433

రిచర్డ్‌ హ్యాడ్లీ

న్యూజిలాండ్‌(పేస్‌ బౌలర్లు)

86

431


క్విక్ రివ్యూ :
ఏమిటి : టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్‌ బౌలర్‌
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్
Published date : 26 Aug 2020 04:41PM

Photo Stories