తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు
Sakshi Education
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి జనవరి 1న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ షేడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుండగా 12,732 పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 1,13,170 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశ ఎన్నికలు జనవరి 7-21 తేదీల మధ్య, 11-25 తేదీల మధ్యలో రెండో దశ, 16-30 మధ్యలో మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు దశల కింద మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుండగా పోలింగ్ రోజే ఫలితాలు వెలువరించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : తెలంగాణ
Published date : 02 Jan 2019 05:47PM