Skip to main content

తెలంగాణలో పిరమాల్ ఔషధ పరిశ్రమ విస్తరణ

ప్రముఖ పారిశ్రామిక గ్రూప్ పిరమాల్ తెలంగాణ రాష్ట్రంలో తనకున్న ఔషధ పరిశ్రమ విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
Current Affairsవరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లిన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు జనవరి 22న అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కేటీఆర్‌తో పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ సమావేశమైన అనంతరం ఆ సంస్థ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తమ కంపెనీలో 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రూ.500 కోట్ల పెట్టుబడి ద్వారా మరో 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఔషధ పరిశ్రమ విస్తరణకు రూ.500 కోట్ల పెట్టుబడి
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : పిరమాల్ గ్రూప్
ఎక్కడ : తెలంగాణ
Published date : 23 Jan 2020 05:33PM

Photo Stories