తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు
Sakshi Education
దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు లభించింది.
ఢిల్లీలో ఫిబ్రవరి 8న జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేశ్‌ప్రభుల చేతుల మీదుగా తెలంగాణ డైయిరీ డెవలప్‌మెంట్ సహకార సంస్థ (విజయ డెయిరీ) ఎండీ శ్రీనివాస్‌రావు ఈ అవార్డును అందుకున్నారు. ‘ఆహార భద్రత-ఆహార నాణ్యత’విభాగంలో విజయ డైరీకి ఈ అవార్డు దక్కింది. సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు విజయ డెయిరీ స్వచ్ఛమైన పాలను అందిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో జాతీయ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తెలంగాణ విజయ డెయిరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో జాతీయ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : తెలంగాణ విజయ డెయిరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 09 Feb 2019 05:24PM