తెలంగాణ ప్రభుత్వంతో స్కైవర్త్ కంపెనీ ఒప్పందం
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్ గ్రూప్ చైర్మన్ లై వీడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నవంబర్ 29న హైదరాబాద్‌లో భేటీ అయింది. తాజా ఒప్పందం ప్రకారం... స్కెవర్త్ కంపెనీ మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది. స్కైవర్త్ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ బ్రాండ్... ఎల్‌ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ స్కైవర్త్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : హైదరాబాద్ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును నెలకొల్పేందుకు

Published date : 30 Nov 2019 05:56PM