తెలంగాణ ప్రభుత్వంతో ఇంటెల్ సంస్థ ఒప్పందం
Sakshi Education
టెక్నాలజీ సంస్థ ఇంటెల్ తాజాగా ఐఎన్‌ఏఐ పేరుతో హైదరాబాద్‌లో అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స రిసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
ఇందుకోసం ఐఐఐటీ-హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2020 వర్చువల్ సమ్మిట్, ఏఐ ఫర్ యూత్ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అక్టోబర్ 12న ఆవిష్కరించారు.
ఐఎన్‌ఏఐ కేంద్రం...
ఆరోగ్యం, స్మార్ట్ మొబిలిటీ వంటి కీలక రంగాల్లో సవాళ్లను పరిష్కరించడంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స (ఏఐ) సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఈ కేంద్రం దృష్టిసారిస్తుంది. స్మార్ట్ మొబిలిటీకి సంబంధించి రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం కోసం రోడ్డు భద్రత విషయంలో ఏఐని వినియోగించి పరిశోధన కొనసాగిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఏఐ పేరుతో అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : టెక్నాలజీ సంస్థ ఇంటెల్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఆరోగ్యం, స్మార్ట్ మొబిలిటీ వంటి రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగంపై పరిశోధనలు చేసేందుకు

Published date : 13 Oct 2020 06:47PM